విజయవాడ

జలసంరక్షణకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: రాబోయే వేసవి కాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికలతో అధికారులను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక మంత్రి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దిశా నిర్ధేశంతో వేసవికాలపు తాగునీటి కార్యాచరణ, జలసంరక్షణ కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఏ గ్రామంలో కురిసిన వాననీరు అదే గ్రామంలో భూగర్భ జలాలుగా రూపాంతరం చెందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఏఏ గ్రామాల్లో తాగునీటిని రవాణా వ్యవస్థ ద్వారా, ట్యాంకర్ల ద్వారా అందించాల్సి ఉందో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీటి, సాగునీరు అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలను రూపొందించారో అధ్యయనం చేస్తున్నామని, వాటిని ఆచరణల్లోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో జలసంరక్షణ కార్యక్రమాలను ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళతామన్నారు. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన వ్యక్తుల సూచనలను, సలహాలను, కళాశాలల విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. జలవనరులను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో చెరువుల్లో, చెరువుగట్టుమీద, కాలువల్లో, డ్రైన్లలో ఉన్న గుర్రపుడెక్కను, తూటకాడ వంటి జంగిల్ క్లియరెన్స్‌లను తొలగించే చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. చలివేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా బాటసారులకు సేదతీర్చే కార్యక్రమాలను చేపడుతున్నామని, ఆయా కేంద్రాల ద్వారా తాగునీటితో పాటు అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లటి మజ్జిగను అందించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన వాతావరణ స్థితిగతులు తెలియజేసే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను, వడగాల్పులను తెలుసుకునేలాగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను తెలుపుతూ ఇప్పటివరకు 6కోట్ల ఘనపు మీటర్లపైగా తవ్వకం పనులను నిర్వహించామని, స్పిల్‌వే లెఫ్ట్‌బ్యాంక్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్‌ల విభాగాల్లో ఆ పనులను చేపట్టామని మంత్రి దేవినేని తెలిపారు. ఇంకా 407.24 లక్షల ఘనపు మీటర్ల తవ్వక పనులను చేపట్టాల్సి ఉందన్నారు. 73.80 మీటర్ల పొడవు గల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందన్నారు. గోడ నిర్మాణంలో భాగంగా అక్కడ ఉన్న రాతి పొరల ఆధారంగా 40 నుండి 60 మీటర్ల లోతు వరకు నిర్మించబడుతుందన్నారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమం ద్వారా గత రెండేళ్లలో మొత్తం 47.60 కోట్ల ఘనపు మీటర్ల చెరువు పూడిక పనులను చేపట్టామన్నారు. 3.36 కోట్ల ఘనపు మీటర్ల మట్టితో చెరువుగట్లను పటిష్టపరిచామని, తూములు, అలుగుల మరమ్మతుల కోసం 3.96 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులను కూడా చేపట్టామన్నారు. రాష్ట్రంలో 3,573 గొలుసుకట్టు చెరువు వ్యవస్థ ఉంటే ఇప్పటివరకు 888 చెరువుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామన్నారు. జలవనరులశాఖ ద్వారా, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 33,162 చెక్‌డ్యామ్‌లను, 3,36,190 పంట సంజీవనిలో భాగంగా పాతవి, కొత్తవి అందుబాటులోకి తీసుకువచ్చామని, 4,36,869 నీటి సంరక్షణ చర్యలను చేపట్టామన్నారు. ఇప్పటివరకు ఇందు నిమిత్తం రూ.8,798 కోట్లు వ్యయం చేశామన్నారు. ఎత్తిపోతల పథకాల విధానంలో నూతనంగా 88 ఎత్తుపోతల పథకాలను పూర్తిచేసి 1,18,187 ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు వసతి అందించగలిగామన్నారు. 312 ఎత్తిపోతల పథకాలను పునర్జీవనం గావించి 2,25,849 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, ఇందుకోసం వెయ్యి ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. ప్రయోగాత్మక బోర్‌వెల్ పథకం కింద ఎస్‌సిల వారికి 381 బోర్లు, ఎస్‌టిల వారికి 128 బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 1254 పిజోమీటర్ల ద్వారా రియల్‌టైమ్ జలస్థాయిని పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి కింద 56,476 స్థలాల్లో భూగర్భ జల సర్వేలను నిర్వహించి వాటిలో 37,807 అనువైనవిగా గుర్తించి సిఫార్స్ చేశామన్నారు. రాష్ట్రంలోని 15.03 లక్షల వ్యవసాయ బోర్‌లను జియోట్యాగింగ్ చేశామన్నారు. ఇందుకోసం ఇస్రోతో ఒప్పందం చేసుకున్నామని, జాతీయ హైడ్రోలజీ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.160 కోట్లను గ్రాంట్‌గా రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు.