విజయవాడ

మహిళా రక్షక్ అదుపులో ఈవ్‌టీజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 11: నగరంలో యువతులు, మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్న 17మంది ఈవ్‌టీజర్లను మహిళా రక్షక్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన మహిళా రక్షక్ బృందాలు ఈవ్‌టీజింగ్ ప్రదేశాలను గుర్తించాయి.
దీనిలో భాగంగా నగరంలోని బెంజిసర్కిల్ సమీపంలోని ఫుట్‌బ్రిడ్జి, కంకిపాడు బస్టాపు, పద్మావతి ఘాట్, కొండపల్లి ఖిల్లా, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో నిఘా వేసి వేధింపులకు పాల్పడుతున్న 17 మందిని పట్టుకున్నారు. వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఏడుగురు విద్యార్ధులు, నలుగురు ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారం చేసుకునేవారు. ఆరుగురు రోజువారి కూలిపనులకు వెళ్ళేవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారు సెంట్రల్ జోన్ పరిధిలో నలుగురు, ఈస్ట్‌జోన్ పరిధిలో ముగ్గురు, సౌత్ జోన్ పరిధిలో ముగ్గురు, నార్త్‌జోన్ పరిధిలో మరో ముగ్గురు, పశ్చిమ జోన్ పరిధిలో నలుగురు ఉన్నారు. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఈవ్‌టీజర్లకు వావస్య మహిళా మండలి సభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేస్ యాక్టు-2013 ప్రకారం ప్రతి కళాశాల, సంస్థలు, హోటల్, రెస్టారెంట్లు, ఏ ఇతర సంస్థలోనైనా పది కంటే ఎక్కువ మంది మహిళలు పని చేసే చోట తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలని, వెంటనే ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.

ఫిరాయింపులు ప్రోత్సహించి
నైతిక విలువలు దిగజార్చిన చంద్రులు
* సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఘాటు విమర్శ

విజయవాడ, ఏప్రిల్ 11: ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు చంద్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికమని, ఇది రాజకీయ వ్యభిచారమని, ఫిరాయింపులతో నైతిక విలువలను చంద్ర ద్వయం దిగజార్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం విజయవాడ దాసరి భవన్‌లో అక్కినేని వనజ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా కె.నారాయణ పాల్గొని దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కెసిఆర్‌ను దనుమాడిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి నుండి ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నిస్తున్నామన్నారు. తనకో నీతి, ఎదుటివానికో నీతి అన్న చందంగా చంద్రబాబు వైఖరి సాగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రులకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పును కోరాలని హితవు పలికారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఇటీవల కాలంలో సిపిఐ నిర్వహించిన కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టి, భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవతో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతీబా ఫూలే 191 జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి నారాయణ, రామకృష్ణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.