విజయవాడ

25 నుండి పోస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: భారత తపాలాశాఖ నిర్లక్ష్యానికి, వివక్షతకు గురౌతున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు ఈనెల 25 నుండి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అధ్యక్షులు దోమా రఘుబాబు వెల్లడించారు. గురువారం స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తపాలాశాఖ పుట్టిన నాడి నుండి డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు, అదనపు డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు అనే రెండు కేడర్లుగా విభజించి డిపార్టుమెంట్ ఉద్యోగులు, గ్రామీణ తపాలా ఉద్యోగులు అనే పేర్లతో పిలుస్తూ దాదాపు 60 సంవత్సరాలుగా ఒకే రకమైన పనులు చేయించుకుంటూ గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా అరకొర జీతాలిస్తూ తపాలాశాఖ వివక్ష చూపుతుందని చెప్పారు. ఈ నేపధ్యంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల జీవన పరిస్థితులు మెరుగుదలకై కేంద్ర ప్రభుత్వం, తపాలాశాఖపై పలుమార్లు ఒత్తిడి తేగా పని పరిస్థితులు, వేతనాలు పరిశీలించుటకు గాను 2015 నవంబర్ 25న రిటైర్డ్ పోస్టల్ మెంబర్ కమలేష్ చంద్రతో కూడిన కమిటీని నియమించగా ఆయన 2016 నవంబర్ 24న తపాలాశాఖకు నివేదికను అందించారని చెప్పారు. గ్రామీణ తపాలాశాఖ ఉద్యోగులకు దాదాపు 80 శాతం అనుకూల అంశాలు కమలేష్ చంద్ర నివేదిక నేటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తపాలాశాఖ నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ కమలేష్ చంద్ర నివేదికలోని పే కమిటీ సిఫార్స్‌లను వెంటనే అమలుచేయాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ మూడంచెల కార్యక్రమానికి పిలుపునిచ్చిందని అన్నారు. తొలివిడతగా పోస్టల్ డివిజనల్ ఆఫీసుల వద్ద ధర్నాలు, మలి విడతగా పార్లమెంటు వీధిలో ధర్నా నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో గాని తపాలాశాఖలో గాని చలనం లేనందున గత్యంతరం లేక దేశంలోని రెండు లక్షల 70 వేల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఈనెల 25 నుండి నిరవధిక చేపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా తపాలాశాఖ స్పందించి కమలేష్ చంద్ర నివేదికలోని సిఫార్స్‌లను తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరవధిక సమ్మెకు సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ విలేఖరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కె.రాధాకృష్ణ విజయవాడ డివిజన్ కార్యదర్శి బి.వెంకటేశ్వరావు, ఎన్‌ఎఫ్‌టిఇ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు టివి రమణమూర్తి పాల్గొన్నారు.

సుంకర ప్యానల్ వర్గానికి
తలొగ్గిన ఐలా ఎన్నికల అధికారి
* తిరస్కరించిన ఏడుగురి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించాలి
* న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం
* చైర్మన్ అభ్యర్థి మహ్మద్ సాధిక్
పటమట, ఏప్రిల్ 13: ఐలా ఎన్నికల అధికారి వెంకట్రావ్ గత ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ ప్యానల్ వర్గానికి తలొగ్గి తమ ప్యానల్ వర్గానికి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఎన్నికల గైడ్‌లైన్స్ పక్రారం తొలుత ఆమోదించి తరువాత సరిగా లేవని తిరస్కరించారని ఐలా చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహ్మద్ సాధిక్ ఆరోపించారు. ఈ నెల 21న ఆటోనగర్ ఏపిఐఐసి ఐలా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఆటోనగర్ ఏపిఐఐసి ఐలా కార్యాలయం వద్ద ఐలా ఎన్నికల అధికారి తమ ప్రత్యర్థి వర్గంతో కుమ్మక్కైయారని ఆరోపిస్తూ సాధిక్ ప్యానల్ వర్గం పెద్ద ఎత్తున ఆదోళన నిర్వహించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పటమటలోని నిర్మలా కానె్వంట్ రోడ్డులోని మాజీ ఐలా ఛైర్మన్ ఎడవ వీరయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఐలా చైర్మన్ అభ్యర్థి మహ్మద్ సాధిక్ మాట్లాడారు. గత నెల 30న ఐలా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం జరిగిందన్నారు. ఈ నెల 7 నుండి నామినేషన్ పత్రాలు జారీ చేశారని, నామినేషన్ల ఆఖరితేదీ 10న కాగా, 11న ఎన్నికల అధికారి నామినేషన్లు పరిశీలించటం జరిగిందన్నారు. తమ ప్యానల్ వర్గం 13 వార్డులకు పోటీ చేస్తూ నామినేషన్ పత్రాలు సమర్పించటం జరిగిందన్నారు. పరిశీలన అనంతరం ఎన్నికల అధికారి వెంకట్రావ్ ఇరువర్గాల పాన్యల్ అభ్యర్థులను పిలిచి చర్చించిన పిదప తమ ప్యానల్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సంతకం చేసి నామినేషన్లు అంగీకరించినట్లు తమకు తెలిపారన్నారు. అనంతరం తమ ప్రత్యర్ధి వర్గం ఎన్నికల అధికారిపై ఒత్తిడి తీసుకురావటంతో వెంటనే వారితో లాలూచిపడి ఆమోదించిన నామినేషన్ పత్రాలలో ఏడుగురిని అనర్హులుగా ప్రకటించటం జరిగిందన్నారు. తొలుత ఆమోదించి తరువాత తిరస్కరించటం ఏమిటని ఎన్నికల అధికారిని ప్రశ్నించిగా కొత్తగా వచ్చిన ఐలా ఎన్నికల గైడ్‌లైన్స్ ప్రకారం ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సరిగాలేకపోటం వలనే తిరిస్కరించటం జరిగిందని ఎన్నికల అధికారి చెప్పటం తమని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎన్నికల అధికారి న్యాయపరంగా ఐలా ఎన్నికలను నిర్వహించాలని లేదా, రద్దు చేసి మరలా ఐలా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిచి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏటిఏ అధ్యక్షుడు రాజనాల బాబ్జీ, ఐలా మాజీ చైర్మన్ ఎడమ వీరయ్య, చందు, ఆటోనగర్‌లోని వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టులో
సిఆర్‌పిల డిమాండ్లు నెరవేర్చాలి
సిఎం చంద్రబాబుకు రఘువీరారెడ్డి లేఖ
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 13: ఎపి సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 3521 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సిఆర్‌పి) ల న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చాలని ఎపిసిసి రఘువీరారెడ్డి ఎపి సిఎం చంద్రబాబునాయుడు ని కోరారు. ఈవిషయమై సిఎంకు లేఖ రాసినట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్న ఆయన సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీవో నెంబర్ 151 ను అమలుచేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈప్రాజెక్టు ఆధ్వర్యంలో 4034 స్కూల్ కాంప్లెక్సులలో పనిచేస్తున్న 3521 మంది కార్మికులు 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సిఆర్‌పిలకు అందుతున్న గౌరవం వేతనం కేవలం 8,500 మాత్రమే కాగా పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సంక్షేమ పథకాలకైనా నోచుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయులుగా అర్హతలున్నా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న సిఆర్‌పిలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకైనా వెనుకాడని దుర్బర జీవితాలను అనుభవిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న 27వేల మంది సిఆర్‌పిలను రెగ్యురలైజ్ చేస్తూ అంసెంబ్లీ చట్టం చేసిందని, అదే మాదిరిగా టిడిపి ప్రభుత్వం కూడా సిఆర్‌పిలకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు.