విజయవాడ

లోకేష్ బాధ్యతగల కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(క్రైం), ఏప్రిల్ 21: నారా లోకేష్ బాధ్యత గల కొడుకైతే.. వైఎస్ జగన్ ఆకతాయి కొడుకని తెలుగుదే శం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అభివర్ణించారు. విజయవాడలోని టిడిపి కార్యాలయంలో శుక్రవా రం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన కుమారుడైన జగన్మోహనరెడ్డిని బెంగుళూరు నుండి హై దరాబాద్ రావద్దని, వస్తే నీ ఆకతాయి పనుల వల్ల నాకు, ప్రభుత్వానికి అప్రతి ష్ట తెస్తావని కట్టడి చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తండ్రి చాటు బిడ్డగా, బాధ్యతాయుతమైన కుమారుడిగా, చక్కగా చదువుకుని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో 8ఏళ్లుగా పార్టీకి పనిచేస్తూ ఈనాడు లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉండటం తప్పా అని నిలదీశారు. బహిరంగ ప్రసంగాల్లో తడబాటు ఎవరికైనా సహజమే.. లండన్‌లో క్వీన్ ఎలిజిబెత్ ముందు ఓపెన్ హౌస్‌లో మాట్లాడు తూ ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ తడబడి తప్పులు మాట్లాడింది ఒకసారి గుర్తుంచుకోవాలన్నారు. అవినీతికి పాల్పడి జైలు జీవితాన్ని గడిపి, అందిరినీ అవినీతిపరులుగా చిత్రీకరించాలని సోషల్ మీడియా శరణుజొచ్చి, కావాల్సినంత ఆర్థికసాయం అందించి లోకేష్‌పైనా, రాష్ట్ర ముఖ్యమంత్రిపైనా అవాకులు చెవాకులు మాట్లాడించటం జగన్‌కు తగదన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని ఎదుటి మనిషిని కించపర్చడం, మానసికంగా బాధపెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర శాసనసభలో చేసి న చట్టాలను సమీక్షించే ఉన్నతస్థాయి పెద్దల సభ శాసనమండలి.. ఆ శాసనమండలిని కించపర్చే రీతిలో అశ్లీల ఫొటోని పెట్టి, పెద్దలకు మాత్రమే అని క్యాప్షన్ పెట్టి అది పెద్దల సభ కాదు, బూతు సభ అని పోస్ట్ చేసిన ఇంటూరి కిరణ్‌కు ఆర్థిక సాయమందించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా లోకేష్ బాబును కించపర్చే హక్కు మీకెవరిచ్చారని జగన్‌ను నిలదీశారు. సభ్య సమాజానికి దూరమైన రోజా, గురువింద గింజలాంటి అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి లాంటి వారు సభలో చిన్న చిన్న తడబాట్లను వేలెత్తి చూపి ఆ యువకుడ్ని మానసికంగా కించపరచాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 200 సీట్లు రాబోయే ఎన్నికల్లో గెలవాలని అనంతపూర్ సభలో లోకేష్ మాట్లాడటంలో తప్పేంటి.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన రాష్ట్రంలో 225 సీట్లు ఉంటాయి.. అందులో 200 సీట్లు తెలుగుదేశం గెలిచేలా కష్టపడండని మాట్లాడిన లోకేష్‌ను తప్పుబట్టడం మీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పరిధి దాటితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.

మరో అవార్డు దక్కించుకున్న సిఆర్‌డిఎ
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 21: రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యున్నత ఆలోచనలతో విన్నూత్నంగా వివిధ వౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా హడ్కో ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించగా శుక్రవారం మరో అవార్డును దక్కించుకుంది. రాజధాని నిర్మాణం కోసం నిర్వహించిన భూ సమీకరణ పథకానికి హడ్కో మరొక పురస్కారాన్ని ప్రకటించింది. ఈనెల 25న జరగనున్న 47వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఈ రెండు అవార్డులను స్వీకరించేందుకు రావాల్సిందిగా సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు హడ్కో ఆహ్వానం పంపింది. 2016-17 సంవత్సరానికి గాను ఇంప్రూవ్ ద లివింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో అర్బన్ గవర్నెన్స్ కేటగిరిలో ఎల్పీఎస్ అవార్డు ప్రకటించారు.