విజయవాడ

010 పద్దు జీతాలెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 2: విఎంసి ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలను చెల్లించే 010 జీవో అమలుకు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ చేస్తున్న కృషి ఫలించేనాన్న విషయం చర్చనీయాంశమైంది. గత దశాబ్ధ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ అంశంపై ప్రస్తుతం మేయర్ పట్టు వీడని విక్రమార్కుడిలా చేస్తున్న ప్రయత్నాలు విఎంసి ఉద్యోగులలో కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం చివరి దశ వరకూ చేరుకొన్న ఈ ప్రక్రియ అప్పటి సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసే చివరి నిమిషం వరకూ ఫైల్ పట్టుకొని తిరుగాడిన విఎంసి జెఎసి నాయకులు చివరికి ఒట్టి చేతులతోనే నగరానికొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి చెప్పుకోవాలంటే విఎంసి ఉద్యోగులకు 010 జీవో ద్వారా జీతాల చెల్లించాలంటూ విఎంసి ఉద్యోగులందరూ చేసిన ఉద్యమాల ఫలితంగా అప్పటి ఎంపి, ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కిరణ్‌కమార్ రెడ్డి రాజీనామా తరువాత రాష్ట్రంలో జరిగిన విభజన, తదుపరి పరిణామాలతో 010 జీవో జీతాలపై ఆశలు చంపుకొన్న ఉద్యోగులు విభజన తరువాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎపి ఎన్‌జీవో జెఏసి ఆధ్వర్యంలో నగరంలో చేసిన సన్మాన కార్యక్రమంలో విఎంసి ఉద్యోగులకు కూడా 010 జీవో ద్వారా జీతాలిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం ఉద్యోగుల మదిలో ఇంకా కదలాడుతూనే ఉంది. గత కొనే్నళ్ళుగా ఈవిషయం ఫైల్స్ దాటి రావడం లేదు. స్వయాన సిఎం లాంటి ముఖ్య పాలకుడే హామీ ఇచ్చినా ఎందుకు కార్యాచరణలోకి రావడం లేదన్న ప్రశ్నకు ఒకే ఒక సమాధానం వినిపిస్తోంది. విజయవాడ నగరానికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద విఎంసి భరాయించాల్సిన 30శాతం అనగా సుమారు 200 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పథకం మంజూరు చేస్తే తమ జీతాలు తామే ఇచ్చుకొంటామన్న విషయం అప్పటి పాలకులు లిఖిత పూర్వకంగా ఇవ్వడమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ పథకం సక్రమంగా అమలు జరిగి తద్వారా సత్ఫలితాలు సాధిస్తే అలాగే జరిగేదేమో.. పథకం అమలు అస్థవ్యస్థగా మారడంతో పథకం ద్వారా వచ్చిన నిధుల సంగతి పక్కన పెడితే అప్పటి నుంచి విఎంసి వందల కోట్లకు అప్పుల పాలవ్వాల్సి వచ్చింది. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ద్వారా అదనపు ఆదాయం రాకపోగా ప్రస్తుత రాబడి ఆదాయం కూడా ఆ పథకానికి తెచ్చిన రుణ వడ్డీకే సరిపోయే పరిస్థితిలో కనీసం జీతాలనైనా ఇచ్చుకోలేక దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ విఎంసి ని అయా దుర్బర పరిస్థితులను అధిగమిస్తూ వస్తున్న తరుణంలో విఎంసి ఆదాయంలో అధిక భాగం సిబ్బంది, ఉద్యోగుల జీతాలకే సరిపోతున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల మాదిరిగా విజయవాడ నగర పాలక సంస్థ కు కూడా 010 జీవో ద్వారా ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తే విఎంసి ఆదాయానికి మెరుగైన సౌలభ్యం కలుగుతుందని భావించిన నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తనదైన శైలిలో బూజు పట్టిన 010 జీతాల ఫైల్ దుమ్ము దులిపి సిఎం చంద్రబాబు నాయుడుతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సంప్రదింపులు జరపగా ప్రస్తుతం ఈవిషయం పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నట్టు వినికిడి. మరికొద్ది నెలలు కాదు రోజుల్లోనే 010 జీతాలపై ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిఎం చంద్రబాబు కూడా తన హయాంలో విఎంసి కి చిరకాలం గుర్తుండిపోయే పనిచేయాలన్న ఉద్దేశ్యంలో భాగంగా దశాబ్ధాల తరబడి అపరిష్కృతంగా ఉన్న 010 జీతాల చెల్లింపునకు మొగ్గుచూపుతోందన్న విషయంపై విఎంసిలో చర్చజరుగుతుండగా ఇందుకు సంబధించిన ఉద్యోగుల వివరాల పట్టికను కూడా ప్రభుత్వం రప్పించుకుంది.
ఇదిలావుండగా, 1981 లో మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ అయిన విజయవాడ అప్పట్లో ఎంత విస్తీర్ణం ఉందో ఇప్పుడూ అంతే ఉన్నదన్నది సుస్పష్టం. నగర పాలక సంస్థకు వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయం 343.44 కోట్ల కాగా వ్యయం 426.48 కోట్లుగా ఉంది. 010 ద్వారా ప్రభుత్వమే జీతాలను చెల్లించాలంటూ 2014 ఆగస్టు 6వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రభుత్వానికి నివేదించింది. 2001 నుంచి విఎంసిలో ఆస్తిపన్ను పెంపు జరగకపోగా ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలతోపాటు విఎంసి అత్యవసర పనుల ఖర్చు దాదాపు 3రెట్లు పెరిగాయి. రాబడి కంటే వ్యయాన్ని ఎక్కువగా చవిచూస్తున్న విఎంసి ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి ఎరియర్స్, సరెండర్ లీవులు, గ్రాట్యూటీ, కమ్యూటేషను, వ్యయాలు చెల్లించలేకపోవడంతో ఇప్పటివరకూ సుమారు 60 కోట్ల మేర బకాయి పడింది. అలాగే కాంట్రాక్టర్లకు కూడా 40 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. మిగులు ఆదాయం లేకపోయిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద కోసం తెచ్చిన 200 కోట్ల రుణానికి సుమారు 25 కోట్లను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉండగా ఆ పథకంలో చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు 15 కోట్లను ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం జీతాల రూపంలో చెల్లిస్తున్న 120 కోట్లను ప్రభుత్వం భరాయిస్తే విఎంసికి ఆ మొత్తం మిగులు ఆదాయంగా ఉంటుండగా ఇక ఆ నిధులతో నగరానికి అవసరమైన అభివృద్ధి నిధులతో ఎంతటి పనులనైనా చేయవచ్చన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు.