విజయవాడ

వాగ్వాదాలు, వాకౌట్లతో రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*
విజయవాడ (కార్పొరేషన్), మే 16: భూ వినియోగ మార్పులపై కౌన్సిల్‌కు వచ్చిన అంశాలతో పాటు సిటీ శానిటేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటులో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదన్న అంశాలపై వాగ్వాదాలు, వాకౌట్లతో మంగళవారం విఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. విఎంసి కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం వందేమాతర గీతం ఆలాపనతో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ ప్రశ్నోత్తరాల సమయం కాగా, తరువాత ఎజెండాలోని మొత్తం 75 అంశాలపై చర్చోపచర్చలు సాగాయి. అంశాలను ఎజెండాలో పొందుపర్చే విషయంపై మేయర్‌తో ప్రతిపక్ష వైకాపా ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల నేతృత్వంలో సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంలో మేయర్ మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోమంటూ బిగ్గరగా అరవటాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమకూ నిర్ణీత విశేష అధికారాలున్నాయని వారు పేర్కొన్నారు. తొలుత ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాల్లో దివంగత నేత, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ సంతాప తీర్మానానికి అధికార టిడిపి, విపక్షాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సిపిఎం సభ్యులు కూడా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో 11వ డివిజన్ నుంచి నూతనంగా ఎన్నికైన వీరంకి కృష్ణకుమారితో మేయర్ శ్రీ్ధర్ ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ప్రశ్నోత్తరాల సమయంలో తాము అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలివ్వడంలో సెక్రటరీ సెల్ అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్ జె నివాస్ భవిష్యత్తులో ఈ సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటానని సభ్యులను సమాధానపర్చారు.
ప్రతిపాదనల తిరస్కారంపై వైసిపి ఆందోళన
డివిజన్లలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనా సంబంధమైన అంశాలపై కౌన్సిల్ ఎజెండాలో తాము చేస్తున్న ప్రతిపాదనలను మేయర్ కోనేరు శ్రీ్ధర్ తిరస్కరించటంపై వైసిపి కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. కేవలం రాజకీయ కోణంలోనే తమ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారని, కౌన్సిల్‌ను కూడా రాజకీయంగానే వినియోగించుకుంటూ నగర పాలనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిల్ భవనం ఎదుట ప్లకార్డులు చేతపట్టి కొద్దిసేపు నినాదాలు చేసిన తరువాత తిరిగి కౌన్సిల్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు డివిజన్ల అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు, ఆయా పనుల ప్రస్తుత పరిస్థితులపై సిపిఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆదిలక్ష్మి వేసిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేదంటూ అన్ని విభాగాల హెచ్‌ఓవోల పనితీరును టిడిపి సభ్యులతో పాటు మేయర్ శ్రీ్ధర్ కూడా తప్పుపట్టారు. 2015, 16, 17 సంవత్సరాల్లో నగరంలోని కొండ ప్రాంతాలకు చెందిన 16 డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులపై అడిగిన ప్రశ్నకు కూడా అధికారులు సమగ్ర సమాధానాలివ్వలేదు. టిడిపి సభ్యురాలు అల్లు జయలక్ష్మి వెహికల్ డిపో వాహనాల పనితీరు, పారిశుద్ధ్య చర్యలు, గార్బేజ్ రవాణా, వాహనాల మరమ్మతులు, వెహికల్ డిపో సిబ్బంది, అధికారుల తీరుపై అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేకపోయారు. భూ వినియోగ మార్పుపై కౌన్సిల్ ఆమోదం కోసం వచ్చిన అంశాలను టిడిపి సభ్యులు ఆమోదించగా వైకాపా సభ్యులు తిరస్కరిస్తూ డిసెంట్ నోట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరగటం గందరగోళానికి దారితీసింది. వైకాపా ఫ్లోర్‌లీడర్ మాట్లాడుతున్న సమయంలో టిడిపి ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు, ఇతర కార్పొరేటర్లు కూడా తమ సీట్లలో నుంచి లేచి వైకాపా చర్చకు అడ్డుతలగడంతో మిగిలిన వైకాకా కార్పొరేటర్లు కూడా మేయర్ పోడియం వద్దకు చొచ్చుకురావడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళా ప్రదర్శనలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు అద్దెను రూ. 15వేలుగా నిర్ణయిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని సూచించారు. ప్రస్తుతం కళాక్షేత్రానికి అత్యధిక అద్దెను వసూలు చేస్తుండటంతో కళాకారులు దూరవౌతున్నారని వివరించారు. దీనికి పుణ్యశీల కూడా మద్దతు తెలపడంతో అద్దె విలువ ఖరారుపై నిర్వహణా కమిటీతో చర్చించాలంటూ తీర్మానించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పలువురు నగరపాలక సంస్థ పాఠశాలలకు బదిలీపై వస్తామంటూ చేసుకున్న అర్జీలపై విఎంసి విద్యాశాఖాధికారులు ప్రతిపాదించిన అంశాలపై అధికార, విపక్ష సభ్యులు, మేయర్ శ్రీ్ధర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటి ప్రతిపాదనలను కౌన్సిల్‌కి తీసుకురావద్దని పేర్కొన్నారు. నగరంలో నిర్మించే అపార్టుమెంట్లలో నిబంధనల ప్రకారం నిర్మించాల్సిన ఇంకుడు గుంతలపై ప్రతిపాదించిన 51వ డివిజన్ కార్పొరేటర్ కె దుర్గ్భావాని మాట్లాడుతూ ప్లాన్ అప్రూవల్, మార్ట్‌గేజ్ రిలీజైన తరువాత ఇంకుడు గుంతలు మూసేయటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అన్నారు. అలాంటి అనైతిక చర్యలను నిలువరించేందుకు అధికారులు తీసుకునే చర్యలు ఏమిటని ప్రశ్నించారు. సిటీప్లానర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి అపార్టుమెంట్‌లో ఇంకుడు గుంత తొవ్విన ఫొటోతో దరఖాస్తు చేస్తేనే మార్ట్‌గేజ్ రిలీజ్ చేస్తున్నామని, తరువాత వాటిని మూసేస్తే ఆస్తిపన్ను శాతంలో 10 శాతం విలువను అపరాధ రుసుముగా విధించి వసూలు చేయవచ్చని వివరించారు. ఖాళీస్థలాల పన్నును 0.5 నుంచి 0.2 శాతానికి తగ్గిస్తే చెల్లింపులు పెరుగుతాయంటూ 42వ డివిజన్ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను ఆఫీస్ రిమార్కులకు పంపారు. నగరంలోని కాల్వగట్లను విఎంసి పరిధిలోకి తీసుకురావడం వల్ల అక్రమ ఆక్రమణలు, అనధికార నిర్మాణాలను నియంత్రించవచ్చని, ప్రజాప్రయోజనాల కోసం వివిధ నిర్మాణాలను, వసతులను కల్పించవచ్చని ప్రతిపాదించగా ప్రభుత్వ నిర్ణయం కోసం పంపిస్తూ తీర్మానించారు. ఇదిలావుండగా ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశమని ఎజెండాలో పేర్కొనగా సభ్యులు ఆలస్యంగా రావటంతో 11 గంటలకు ప్రారంభించారు. నూతనంగా బదిలీపై వచ్చిన అధికారుల పరిచయంలో భాగంగా కమిషనర్ జె నివాస్ తనకు తానుగా కౌన్సిల్‌కు పరిచయం చేసుకున్నారు.

డివిజన్లలో తలెత్తుకోలేక పోతున్నాం!
* పారిశుద్ధ్య చర్యలు, పెన్షన్ల పంపిణీ తీరుపై
కౌన్సిల్‌లో నగర ప్రజాప్రతినిధుల ఆవేదన
* త్వరలోనే అంతా సరిచేస్తానన్న కమిషనర్ నివాస్
విజయవాడ (కార్పొరేషన్), మే 16: నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల తీరుపై కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన విఎంసి కౌన్సిల్ సమావేశంలో వెహికల్ డిపో పనితీరుపై 49వ డివిజన్ కార్పొరేటర్ అల్లు వెంకట జయలక్ష్మి చేసిన ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష సభ్యులు సమీక్షించారు. ప్రజాసమస్యలు పరిష్కారం కాక డివిజన్లలో తలెత్తుకు తిరిగలేకపోతున్నామని పలువురు ఆందోళన వ్యక్తపర్చారు. చెత్త రవాణాకు విఎంసికి ఉన్న వాహనాలు, వాటి సిబ్బంది తీరుపై కౌన్సిల్‌లో ఏకరవు పెట్టిన సభ్యులకు మేయర్ కోనేరు శ్రీ్ధర్ కూడా మద్దతు తెలపడంతో చర్చ మరింత వేడెక్కింది. వైసిపి కార్పొరేటర్ కావటి దామోదర్ తన డివిజన్‌లో 35 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉండగా కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే పనిచేస్తున్నారని తానే ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. దీనిపై మేయర్ శ్రీ్ధర్ స్పందిస్తూ అంతమందికి ఒకేసారి సెలవులకు ఎందుకు సమ్మతించారంటూ ప్రజారోగ్య శాఖాధికారులను నిలదీశారు. 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ మాట్లాడుతూ తన డివిజన్ పరిధిలోని మ్యాంగో మార్కెట్‌కు చెందిన వ్యర్థాల తరలింపులో నెలకొన్న జాప్యంతో పాటు చెత్త రవాణా చేసేలోగా స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్ గోడ పక్కన డంప్ చేస్తున్నారని వాపోయారు. దీంతో మండపంలో ఆయా కార్యక్రమాలే కాకుండా కనీసం భోజనం కూడా చేయలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్, వెహికల్ డిపో అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడం ప్రజారోగ్య శాఖ పనితీరుకు అద్దం పడుతోందంటూ ధ్వజమెత్తటంతో కమిషనర్ జె నివాస్ స్పందించారు. త్వరలోనే చెత్త రవాణా చేసే వాహనాల స్థితిగతులు మెరుగుపడతాయని హామీ ఇవ్వడంతో సభ్యులు నెమ్మదించారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో యుసిడి అధికారులు, సిబ్బంది అవలంభిస్తున్న తీరును కూడా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏకరవు పెట్టారు. కొందరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సిఆర్‌పి, సోషల్ వర్కర్ల అనైతిక చర్యలతో సమాజంలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్లతో పాటు స్వయం సహాయక సంఘాల గ్రూపుల నిర్ణయాత్మక సమావేశాల్లో కూడా వారు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్ష కార్పొరేటర్ల డివిజన్లలో మరోలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. 22వ డివిజన్‌లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన మరణ వాంగ్మూలంలో సంబంధిత సివో, సిఆర్‌పి, తదితర సిబ్బందిపై ఆరోపణలు చేసినా ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హేయమంటూ 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లెం రవికుమార్ యుసిడి విభాగం సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు కార్పొరేషన్ల రుణాలపై వైసిపి కార్పొరేటర్ షేక్ బీజాన్ బీ మాట్లాడుతూ రుణాల మంజూరు, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో నెలకొన్న లోపాలు, యుసిడి విభాగం అధికారులు, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదు చేశారు. మిగిలిన సభ్యులు కూడా మద్దతు పలికారు. దీనిపై సభ్యుల ప్రశ్నలకు యుసిడి పివో సమాధానం చెప్పక తప్పలేదు.