విజయవాడ

వయోవృద్ధుల ట్రిబ్యునల్ కేసులు సత్వరం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: వయోవృద్ధులకు సంబంధించిన ట్రిబ్యునల్ కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్, కమిటీ చైర్మన్ లక్ష్మీకాంతం అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోవృద్ధులకు అందుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఓల్డేజ్ హోంలను సక్రమంగా నిర్వహించేలా విభిన్న ప్రతిభావంతులు, వృయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు వారి నెలవారీ పోషణకై ట్రిబ్యునల్‌లో వేసే కేసులు మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా సంస్థ వయో వృద్ధులకు అందిస్తున్న టికెట్ రాయితీ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కమిటీలో చర్చించారు. ప్రతినెలా రెండవ, మూడవ మంగళవారం, నాల్గవ శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వారి సమస్యలు పరిష్కారానికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, కమిటీ కన్వీనర్, అసిస్టెంట్ డైరక్టర్ ఎవిడి నారాయణరావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎం.చక్రపాణి, ఎస్.హరీష్, పి.సాయిబాబా, సిహెచ్ రంగయ్య, ఇన్‌ఛార్జి డిఆర్వో వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలు
జిల్లావ్యాప్తంగా పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, ప్రధాన గ్రామ పంచాయతీల్లో అన్ని వౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం మేరకు పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 24 గంటలు తాగునీరు, కోతలు లేని విద్యుత్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వర్మీ కంపోస్టు, పారిశుద్ధ్య నిర్వహణ అన్ని గ్రామ పంచాయతీల్లో జరగాలన్నారు. తప్పనిసరిగా మీ-సేవ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల నిర్వహణపై ఈనెల 21వ తేదీ బుధవారం మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
ప్రజల నుండి వచ్చే రోజువారీ అర్జీలను అదేరోజు పరిష్కరించాలని లేనిపక్షంలో ఎవరిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి జిల్లాలో అన్నిరకాల అర్జీలు 36వేలు పైగా పెండింగ్‌లో ఉండగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపి అన్ని శాఖల 10వేల అర్జీలు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిని రేపటిలోగా పరిష్కరించాలని, ఏ శాఖలోను పెండింగ్ అర్జీ ఉండరాదని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించామని వివరించారు.

నెలాఖరులోగా బెల్ట్‌షాపులు రద్దుచేయాలి
* ఎక్సైజ్ కమిషనర్‌కు ప్రజాసంఘాల వినతి

విజయవాడ, జూన్ 19: నెలాఖరులోగా బెల్ట్ షాపులను సమూలంగా తొలగించకపోతే ప్రజలే స్వచ్ఛందంగా ఆయా ప్రాంతాల్లో బెల్ట్ షాపులన్నింటిని తొలగించే చర్యలు చేపడతారని మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ హెచ్చరించింది. సోమవారం నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహంను కలిసిన పలు మహిళా సంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల రాష్ట్ర నేతలు వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పును సంపూర్ణంగా అమలుచేసి రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనున్న అన్ని మద్యం షాపులను, బార్‌లను తొలగించాలని నగరం, పట్టణాల మధ్యగుండా పోయే జాతీయ, రాష్ట్ర రహదారులకు మినహాయింపు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పౌర సమాజ మద్దతుతో ఎక్సైజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేసి బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలిస్తానని, మద్యం దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం చేస్తామని, మద్యం అక్రమాలపై 1100 టోల్‌ఫ్రీ నెంబరుకు మరియు 9515124852 నెంబరుకు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఎంఆర్‌పి ధరకన్నా ఎక్కువగా అమ్మినా బడి, గుడి, నివాస ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా, బహిరంగ మద్యసేవనం చేస్తున్నా మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల మద్దతుతోనే మద్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గ్భావాని, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, వైఎస్‌ఆర్‌సిపి మహిళా విభాగం నేత కైలి జ్ఞానమణి, ఏపి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు, 123 స్వచ్ఛ పాలిటిక్స్ అధ్యక్షుడు బడే జాని, ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.