విజయవాడ

పట్టిసీమతో డెల్టా రైతుకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 27: నేడు రాష్ట్రంలో పట్టిసీమ నిర్మాణం తర్వాతే డెల్టా రైతాంగానికి జరుగుతున్న మేలు గతంలో ఎన్నడూ లేదని ఎమ్మెల్సీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. నీవు మంత్రిగా ఉండగా కృష్ణాడెల్టాకు ఏమి చేశావో దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పాలని వైసిపి నేత పార్ధసారధికి సవాల్ విసిరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు గతంలో ఏకైక మంత్రిగా ఉన్న సారధి కృష్ణాడెల్టా మొడరైజేషన్‌కు చేసిన మేలేంటని ప్రశ్నించారు. ఆధునీకీకరణ నిధులు వినియోగించుకుని జిల్లా రైతాంగం పట్ల ప్రేమ ఉంటే అప్పుడే చిత్తశుద్ధి నిరూపించుకునేవాడని అన్నారు. ఇవాళ పట్టిసీమ ద్వారా నీరు తీసుకువచ్చి రైతాంగానికి అందిస్తుంటే ఈర్ష్యతో పార్ధసారధి పట్టిసీమ వల్ల పంటలు పండలేదని వ్యాఖ్యానించడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. డెల్టాలో ఏడున్నర లక్షల ఎకరాల భూమి పట్టిసీమ ద్వారా ఎర్రనీళ్ళు ప్రవహించి తద్వారా పంట దిగుబడి పెరిగిందని రైతులంతా ఆనందపడుతుంటే అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తి పడే సంస్కృతి వారిదంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఈరోజు ఏవిధంగా పని చేస్తోందో ప్రజలకు తెలుసునని, అవివేకంగా మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ రెహ్మన్, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నాయకులు మహ్మద్ షేక్, ఫైజాన్, అట్లూరి రమేష్ పాల్గొన్నారు.