విజయవాడ

పెదమాదిగనన్న చంద్రబాబు నోరు విప్పరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: అతి పెద్ద వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని గరగపర్రు గ్రామంలో దళితులను వెలివేసిన బాధ్యులను గుర్తించి సభ్య సమాజం నుండి బహిష్కరించాలని సామాజిక హక్కుల వేదిక నగర కన్వీనర్ దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గరగపర్రు ఘటనను ఖండిస్తూ దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్), సామాజిక హక్కుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో నిరసన ధర్నా జరిగింది. కార్యక్రమంలో దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నేనే పెద్ద మాదిగనని, నెం.1 కూలీనని, సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు దళితులపై జరుగుతున్న అకృత్యాల పట్ల ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని గొప్పగా చెప్పిన చంద్రబాబు గరగపర్రు గ్రామంలో భారతరత్న విగ్రహాన్ని చెరువులో పడవేస్తే చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప మాట్లాడుతూ గరగపర్రులోని సెంటర్‌లో అన్ని విగ్రహాలు ఉండగా ఎంతోకాలంగా గ్రామంలోని వారందరూ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రయత్నాలు చేస్తుండగా కొంతమంది పెత్తందార్లు కుట్రతో దళితులను ఏకంగా వెలివేయడం ద్వారా పనులు దొరక్కుడా ఆర్థిక దిగ్బంధన చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సామాజిక హక్కుల వేదిక నాయకుడు జి.కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో పల్లా సూర్యారావు, లంక దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, డివి రమణబాబు, తాడి పైడయ్య, అప్పురుబోతు రాము తదితరులు పాల్గొన్నారు.

8న జాతీయ లోక్ అదాలత్
విజయవాడ (క్రైం), జూన్ 27: రాష్ట్రంలో జూలై 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండి పెండింగ్‌లో ఉన్న కేసులను సెటిల్‌మెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అధారిటి మెంబర్ సెక్రటరీ పివి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ న్యూఢిల్లీ జస్టీస్ దీపక్ మిశ్రా, హైకోర్టు ఆఫ్ జ్యురికేచర్ ఏట్ హైదరాబాద్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏపిఎస్‌ఎల్‌ఎస్‌ఏ జస్టీస్ రమేష్ రంగనాధన్ సూచనల మేరకు జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వారి పరిధిలో సెటిల్‌మెంట్ చేయాల్సిన కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో ప్రవేశపెట్టి పరిష్కరించాల్సిందిగా కోరారు.