విజయవాడ

8 నెలలు.. 10 శాతం పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 22: నగరంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకమైన స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టు పనుల నత్తనడకపై నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సుమారు రూ. 461 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ నిబంధన ప్రకారం రెండేళ్లలో పూర్తికావాల్సి ఉండగా ప్రస్తుతం పనులు ప్రారంభించి 8నెలలవుతున్నా కనీసం 10శాతం పనులైనా పూర్తికాకపోవటంపై ఆగ్రహం వ్యక్తపర్చారు. కాంట్రాక్ట్ తీరుతో పాటు కాంట్రాక్ట్ పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు, విఎంసి ఇంజినీరింగ్ అధికారులు తమ విధి నిర్వహణలో అవలంభిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొని అందుకనుగుణంగా పనులు చేపట్టాలని మేయర్ ఆదేశించారు. డ్రైన్‌లో లెవల్స్, ఎలైన్‌మెంట్‌లలో ఎటువంటి తేడాలు లేకుండా సక్రమ నీటి పారుదల అయ్యేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పనుల పరిశీలనలో విఎంసి ఇఇ ఐజాక్ ప్రభాకర్, పబ్లిక్ హెల్త్ ఇఇ సుధాకర్, డిఇఇ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

హెడ్ వాటర్ వర్క్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు తగదు
* మేయర్ శ్రీ్ధర్ అభ్యంతరం
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 22: దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపుపై నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 30 వరకూ నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీపురం వైపు వెళ్లే వాహనాలను దుర్గగుడి మీదుగా వెళ్లే మార్గంలో స్థానిక విఎంసి హెడ్ వాటర్ వర్క్స్ పక్క నుంచి వెళ్లేందుకు ప్రతిపాదనలు చేస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న మేయర్ మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను కలిసి సమీక్షించారు. హెడ్ వాటర్ వర్క్స్ పక్క నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం వలన వాటర్ వర్క్స్‌కు చెందిన వాటర్ పైప్‌లైన్లు దెబ్బతిని నగరవ్యాప్తంగా నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదముందని వివరించారు. ట్రాఫిక్ మళ్లింపుపై పునరాలోచన చేయాలని కోరగా అందుకు స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ శ్రీ్ధర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.