విజయవాడ

అంగన్‌వాడీ భవనాలకు స్థలాలు గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పక్కా భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3,812 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను 2,722 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. మిగిలిన 1090 అంగన్‌వాడీ కేంద్రాలకు స్థలాలను తక్షణమే గుర్తించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను, తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డిఆర్వో ఎం వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో ఎస్ హరిష్, డిపిఓ ఆనందబాబు, ఐసిడిఎస్ పిడి కె కృష్ణకుమారి తదితరులు ఉన్నారు.
చురుగ్గా అర్జీల పరిష్కారం
జిల్లాలో మీ కోసంలో వస్తున్న అర్జీలు సత్వర పరిష్కారం కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్న దృష్ట్యా మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ అన్నారు. మీ కోసంలో 12.21 లక్షల అర్జీలు రాగా 12.14 లక్షల అర్జీలు పరిష్కారంతో 99.47 శాతంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. పరిష్కార వేదికలో 7,300 ఫిర్యాదులు రాగా 5,300 పరిష్కరించామన్నారు. సోషల్ మీడియాలో 11 ఫిర్యాదులు రాగా పదింటిని పరిష్కరించామన్నారు. గ్రీవన్స్ ఎపి సిఎం కనె్వక్‌ట్‌విటి కృష్ణా జిల్లాకు సంబంధించి 183 అర్జీలు రాగా 109 పరిష్కరించటంతో 60 శాతంతో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.

రైతులకు సాగునీరివ్వటమే లక్ష్యం
* ద్వితీయ బహుమతి పొందిన శకటానికి మంత్రి ఉమా అభినందనలు

విజయవాడ, ఆగస్టు 22: నీరు - ప్రగతి పథకం ద్వారా రాష్ట్రంలోని రెతులకు అవసరమైన సాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే రీతిలో జలవనరుల శాఖ శకటాన్ని రూపొందించటం అభినందనీయమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలలో ద్వితీయ బహుమతి సాధించిన జలవనరుల శాఖ శకటాన్ని రూపొందించిన శిరీషా ఎడ్వర్‌టైజింగ్ అధినేత పి గురుబాబును మంగళవారం మంత్రి ఉమా అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగానికి నీరు - ప్రగతి ద్వారా ప్రాజెక్టులు, చెడ్‌డ్యామ్‌ల నిర్మాణం, రెయిన్‌గన్స్, కాలువల పూడికతీత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, పంట కుంటల నిర్మాణాల ద్వారా సాగునీటిని అందించి రాష్ట్రాన్ని శశ్యస్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమన్నారు. శిరీషా ఎడ్వర్‌టైజింగ్ అధినేత పి గురుబాబు మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల నుండి జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమ సంస్థ ప్రభుత్వ శకటాలను రూపొందించటం జరుగుతుందన్నారు. ఈ ఏడాది అటవీశాఖ, జలవనరులశాఖ శకటాలను రూపొందించామని వాటికి ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించడం ఆనందంగా ఉందన్నారు.