విజయవాడ

పగిలిన మంచినీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఆగస్టు 22: మురుగు కాలువ సిల్ట్ తీయడానికి యత్నిస్తే మంచినీటి పైపు పగిలిపోయింది. దీంతో 31వ డివిజన్‌లోని కెఎల్ రావునగర్ వాసులు మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా వాటర్ ట్యాంకులతో తాగునీటిని అందిస్తున్నారు. సమస్య తీవ్రతను కార్పొరేటర్ నాగోతి నాగమణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మంగళవారం చిట్టిపార్క్ పక్కన పైపులైన్‌ల మరమ్మతులు పనులు చేపట్టారు. గత నాలుగురోజుల క్రితం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ 31వ డివిజన్‌లో పర్యటించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించారు. చిట్టిపార్కు ఎదుట మురుగుకాలువలో సిల్ట్ పేరుకుపోయిన విషయం గ్రహించిన ఆయన అవసరమైతే ఆధునిక యంత్రాలతో సిల్ట్‌ని తీయాలన్నారు. అధికారులు మురుగుకాలువ సిల్ట్ తీస్తుండగా తాగునీటి పైపులు పగిలిపోయాయి. కొండనాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందనే చందంగా మురుగు కాలువ సిల్ట్ తీయడానికి యత్నించగా తాగునీటి పైపులు పగిలాయి. అధికారులు కూడా సకాలంలో స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. కాగా పైప్‌లైన్ పనులను స్థానిక తెదేపా నాయకులు నాగోతి రామారావు దగ్గరుండి పనులు చేయించారు.

నాట్య కళాకారులకు నృత్యదీపిక, నృత్యప్రియ అవార్డుల ప్రదానం
విజయవాడ (కల్చరల్), ఆగస్టు 22: శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ, ఎస్ ఫైన్ ఆర్ట్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘంటసాల విఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోని కళావేదికపై అకుంఠిత కృషి, పట్టుదలతో నాట్యంపై భక్తి విశ్వాసాలు మెండుగా గలిగి ప్రదర్శనలిస్తున్న చిన్నారులకు, దీక్షాదక్షతలతో లక్ష్యంతో నాట్యాచార్యులుగా కీర్తిగడిస్తున్న వారికి నృత్యదీపిక, నృత్య ప్రియ అవార్డుల ప్రదానం జరిగింది. తడవర్తి కుసుమిత (విజయనగరం), తాడిపర్తి నాగ తేజస్వీ, మాంబుళ్ళి ధన్యశ్రీ, రేష్మితా అపూర్వ, ఆళ్ళ శ్రీసాయిలాస్య, మునగాల యశ్వంతలక్ష్మీ, మాదిరెడ్డి నాగసాయి త్రిషలకు నృత్య దీపిక అవార్డులను, శ్రీకృష్ణ (పాండిచ్చేరి)కు నృత్య ప్రియ అవార్డులను ప్రదానం చేశారు. వేదికపై అతిథులుగా డి విజయభాస్కర్, గోళ్ల నారాయణరావు, నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాం, నాట్యాచార్య పిళ్లా ఉమామహేశ్వరరావు పాత్రుడు, చింతా రవిబాలకృష్ణ, అజయ్ శ్రీనివాసచక్రవర్తిలు పాల్గొని ప్రసంగిస్తూ నాట్యం మానసిక వికాసంతోపాటు శారీరక వికాసాన్ని కలిగిస్తుందని నర్తకీమణులను ఆశీర్వదించి, నాట్యాచార్యులను అభినందించారు. పర్యవేక్షణ మురమళ్ల సురేంద్రనాథ్, సప్పా శివకుమార్‌లు చేశారు.
రమణీయం నాట్య ప్రదర్శన
అదే వేదికపై ప్రారంభంలో చిన్నారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు రమణీయంగా సాగాయి. కుసుమిత నాట్యం తానవర్ణంతోపాటు నాగతేజస్వి భోశంభో అనే అంశాన్ని తదితర అంశాలను చక్కగా నర్తించారు. తదుపరి శ్రీ కృష్ణ (పాండిచ్చేరి) బృందం గణపతిస్తుతి తదితర అంశాలను ప్రతిభాన్వితంగా ప్రదర్శించారు. మురమళ్ల సురేంద్రనాథ్ (హైదరాబాద్) సూర్యాష్టకం అంశాన్ని ప్రశంసాయుతంగా ప్రదర్శించారు.