విజయవాడ

జిల్లా అంతటా రెడ్‌క్రాస్ సేవలు విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు విస్తృతపరచి యువతకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. మంగళవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్‌పర్సన్ రీచల్ ఛటర్జీ, జనరల్ సెక్రటరీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ బలోపేతం పై జిల్లా కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూత్ రెడ్‌క్రాస్, జూనియర్ రెడ్‌క్రాస్‌లను బలోపేతం చేసే విధంగా కృషి చేస్తున్నట్లు చైర్‌పర్సన్‌కు వివరించారు. అన్ని కళాశాలలో జూనియర్ రెడ్‌క్రాస్ సంస్థలు పని చేసే విధంగా ఇప్పటికే అన్ని కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జరీ చేయడం జరిగిందన్నారు. విజయవాడ రాజధాని కేంద్రం కావడం కృష్ణాజిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థ కార్యక్రమాలు చేయూతనిచ్చే విధంగా రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వస్తుందని ఆ సంస్థ చైర్‌పర్సన్ రేచర్ల ఛటర్జీ అన్నారు. సంస్థ భవన నిర్మాణానికి స్థలం మంజూరు పట్ల సానుకూలత చూపిన కలెక్టర్ పనితీరు పట్ల ఆమె అభినందనలు తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించే విధంగా సంస్థ ద్వారా చేపట్టనున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ అధ్యక్షులు, ప్రముఖ దంతవైద్యులు డా ఏ శ్రీ్ధరరెడ్డి, జనరల్ సెక్రటరీ డా ఇళ్లారవి, ఆర్డీవో హరీష్, తహశీల్దార్ శివరావు పాల్గొన్నారు.

గూగుల్‌తో ఓలా క్యాబ్స్ ఒప్పందం
విజయవాడ, ఆగస్టు 22: రవాణా రంగంలో దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మొబైల్ యాప్ ఓలా తమ ఔట్ స్టేషన్ విభాగం కోసం మంగళవారం గుగూల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఓలా వీపి - అపరేషన్స్ విజయ్‌ఘాడ్జే మాట్లాడుతూ పలు నగరాల నడుమ ప్రయాణించే ప్రయాణికులకు ఇంటర్ సిటీ ట్రావెల్స్ కోసం స్మార్ట్ మొబిలిటీ ద్వారా ఓలా ఔట్ స్టేషన్‌ను గూగుల్ మ్యాప్స్‌పై తెలుసుకోవచ్చని అన్నారు. దీని ద్వారా ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ బుకింగ్స్ పూర్తి చేసుకోవచ్చన తెలిపారు. ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు, పూణే, హైదరాబాద్ ఇతర నగరాల్లో పలు మార్గాలను కవర్ చేసే రీతిలో ఈ భాగస్వామ్యం ఉండటంతో పాటుగా మరింత మంది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.