కృష్ణ

యూజర్ ఫ్రెండ్లీగా సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచటం వల్ల మెరుగైన సేవలు అందించేందుకు యూజర్ ఫ్రెండ్లీగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం మంచి పరిణామమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్స్‌లు ఆన్‌లైన్‌లో పొందేందుకు ఆర్టీఏ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన సులువుగా ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్స్‌లు పొందేందుకు ఆన్‌లైన్ ఎల్‌ఎల్‌ఎర్ టెస్ట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవటం వల్ల మరింత మేలు చేకూరుతుందన్నారు. ఆర్టీఏ కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్‌లో సదుపాయాలు వల్ల జీరో చలానా తీసుకోనవసరం లేదని, అభ్యర్థి ఫోటోతో పాటు ఫామ్ 1, 2,్ఫమ్ 2ఏలు ఆన్‌లైన్‌లో పూర్తి చేసి ఇస్తే సరిపోతుందన్నారు. గతంలో లాగా ఆఫీస్‌ల దగ్గర కెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని, మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. దీని వల్ల సమయం ఆదాతోపాటు నిరంతరం వేసి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఇంటి దగ్గర నుంచి అయినా మొబైల్ ఫోన్, టాబ్‌ల ద్వారా ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ఎల్‌ఎల్‌ఆర్ వల్ల ఖర్చు కూడా ఆదా అవుతుందన్నారు. అనంతరం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లి బొటనవేలితో తంబ్ (బయోమెట్రిక్) వేసి, కంప్యూటర్ టెస్ట్‌లో పాల్గొంటే సరిపోతుందన్నారు. ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్స్‌లు ఆన్‌లైన్‌లో పొందే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డిటిసి మీరా ప్రసాద్, ఎంవిఐలు ఓలేటి శ్రీనివాస్, ఏఎంవిఐలు జగదీష్‌బాబు, ఖాళీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.