విజయవాడ

తెలుగువారి క్రీడ ‘కబడ్డీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 15: తెలుగువారి క్రీడ కబడ్డీ అని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఆధరణ ఉన్నందున ప్రోకబడ్డీ లీగ్ ఎంతో విజయవంతమైందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి కొ ల్లు రవీంద్ర అన్నారు. ఎఎంఈ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని హోటల్ ఫార్ఛూన్ మురళిలో ఆంధ్ర ప్రీమియర్ కబడ్డీ లీగ్ లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ 13జిల్లాలో ఎంపికలు నిర్వహించి 8జట్లు ఎంపిక చే యడం జరుగుతుందని, 16రోజులు 32మ్యాచ్‌లు నిర్వహిస్తారని పేర్కొన్నా రు. జనవరి 27నుండి ఫిబ్రవరి 13 వరకు ఈప్రీమియర్ లీగ్ జరుగుతుందని, విజయవాడ, విశాఖపట్నంలో మ్యాచ్‌ల నిర్వహించనున్నట్లు తెలిపా రు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా 100 మంది కోచ్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. అకాడమిలతో పాటు నాలుగు వాటర్ స్పోర్ట్స్ అకాడమిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమరావతిలో 400 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. గుంటూరు బ్రహ్మనందరెడ్డి స్టేడియంను పరిశీలించి రూ.150 నుం డి 200 కోట్ల రూపాయలు డెవలప్‌మెంట్‌కు పిపిపి పద్ధతిలో చేయడానికి కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందని, క్రీడ హబ్‌గా రాష్ట్రాన్ని తయారుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వీర్లంకయ్య మాట్లాడుతూ ఎఎంఈ స్పోర్ట్స్ సంస్థతోఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు ఐదు సంవత్సరాల ఒప్పందం కుదిరిందని, ప్రీమియర్ లీగ్ ఐదు సంవత్సరాల పాటు నిర్వహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎఎంఈ స్పోర్ట్స్ అధినేత హిమబిందురెడ్డి, ఎన్ నరసింహరావు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జాతీయ ఫొటోగ్రాఫీ పోటీలు

విజయవాడ, అక్టోబర్ 15: స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కల్చరల్ క్రియేటివ్ కమిషన్ సహకారంతో జాతీయ ఫొటోగ్రఫీ పోటీలు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరియు అమరావతి సెంటర్‌లో నిర్వహించింది. ఫొటో జర్నలిజం పితామహుడు అస్కార్ బర్నాక్ 138వ జయంతి సందర్భంగా ఫొటో జర్నలిజం అంశంలో పోటీలు జరిగాయి. దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి 263 మంది 1790 ఫొటోలు ఈ పోటీకి పంపారు. ఆదివారం నగరంలో ఫొటోలను పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ టి నారాయణ, సిహెచ్ విజయభాస్కరరావు, రవికాంతరెడ్డిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఫలితాలను అసోసియేషన్ చైర్మన్ టి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజులు ప్రకటించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఈ విధంగా ఫొటోగ్రఫీలో పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న అసోసియేషన్‌ని అభినందించారు. ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ క్రీడలపై పోటీలు నిర్వహించటం గర్వంగా ఉందని ఛాయా చిత్రకారులు ప్రత్యేకంగా ఫొటో జర్నలిస్టులు ఎంతో శ్రమతో ఈ విధంగా ఫొటోలు తీయడం వాటికి పోటీలకు పంపటం అందులో అవార్డు వస్తే ఎంతో ఆనందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలను సత్కరించారు. నవంబర్ 1న ప్రపంచ ఫొటో జర్నలిజం డే సందర్భంగా అవార్డులు పొందిన ఛాయాచిత్రాలను ప్రదర్శన మరియు అవార్డుల ప్రదానోత్సవం కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో జరుగుతుందని అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.