విజయవాడ

‘స్మార్ట్ పార్కింగ్’ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 16: నగరంలో రోజురోజుకూ తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు అవసరమని విఎంసి కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. ఈసందర్భంగా నగరంలో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ సాధ్యాసాధ్యాల అమలుపై సమీక్షించిన నివాస్ అధికారులతోపాటు స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి గాను ముందుకొచ్చిన వివిధ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. టెండర్ దశకొచ్చిన స్మార్ట్ పార్కింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేసేందుకు గాను ప్రస్తుతం నగరంలో ఉన్న పార్కింగ్ విధానాలు, వాహన చోదకులకు అందుబాటులోని సౌకర్యాలు, పార్కింగ్ ప్రదేశాలు, వాటి స్థితిగతులు తదితర అంశాలపై సమీక్షించిన నివాస్‌కు, స్మార్ట్ పార్కింగ్ విధానంలో అమలుచేయబోయే విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులు వివరించారు. ఈ సమీక్షలో విఎంసి ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ చంద్రన్న బీమా వర్తింపు
* మేయర్ కోనేరు శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న చంద్రన్న బీమా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసి నగరంలోని అర్హులందరినీ బీమా పథకంలో చేర్చాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా సోమవారం ఉదయం తన ఛాంబర్‌లో యుసిడి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో సిఎం చంద్రబాబు నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తరుణంలో వాటిలో చంద్రన్న బీమా పథకం ఎంతో కీలకమని, పేద, అల్పాదాయ, మధ్య వర్గాల జీవితాలకు ధీమా కల్పించే చంద్రన్న బీమా అమలులో ఎటువంటి అలక్ష్యం వహించరాదన్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 80వేల మంది నమోదైన వైనం అభినందనీయమని, ఇంకా 70వేల మంది నమోదుకు ప్రభుత్వం సంకల్పించినందున ఇంకా మిగిలిన అర్హులందరినీ బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ ఎంవివి సత్యనారాయణకు సూచించారు. 18 నుంచి 59ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులేనన్నారు. గతంలో 18 నుంచి 50ఏళ్ల వరకు ఉన్నవారికి రూ.30వేలకే పరిమితంగా ఉండేదని, ప్రస్తుతం సిఎం చొరవతో సహజ మరణానికి రూ.2లక్షల వరకూ అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రమాద మరణానికి 5లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే రెండున్నర లక్షల రూపాయలతోపాటు ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్ రూపేణా నెలకు రూ.100ల చొప్పున 9, 10 తరగతులకు, ఇంటర్ వరకూ రూ.2,400 చొప్పున మంజూరు చేస్తారన్నారు. కావున అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి సమగ్ర చర్యలతో అర్హులందరినీ చంద్రన్న బీమా పథకంలో నమోదు చేయాలని సూచించారు.