విజయవాడ

ముఖ్యమంత్రి చొరవతో కదిలిన రైల్వే అధికారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, అక్టోబర్ 16: సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకోవడంతో ఎట్టకేలకు పాల ఫ్యాక్టరీ సమీపంలోని చనమోలు వెంకట్రావు ఫ్లైవోవర్ వంతెన మరమ్మతు పనులను రైల్వే అధికారులు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వంతెనకు బీములు ఏర్పాటు చేశారు. ఇంకా మూడు రోజులపాటు మరమ్మతులు జరిగితేగాని ప్రమాద స్థితి నుండి వంతెన బయటపడదు. సెప్టెంబర్ 6న ‘పైకెక్కితే ప్రకంపనలు - కుంగుతున్న ఫ్లైవోవర్’ శీర్షికన ‘్భమి’లో వార్తాకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రైల్వే అధికారులు మరునాడే పరుగులు తీశారు. ఈ వంతెన సిమెంట్ బ్లాక్ ఒకటి సుమారు 10 అంగుళాల మేర పక్కకి జరిగిన విషయాన్ని పరిశీలించారు. బ్లాకుల కింద బేరింగ్‌లు జరగడంతో అంత గ్యాప్ వచ్చిందని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. కానీ ఇంతవరకు మళ్లీ అటువైపు తొంగి చూడలేదు. దినపత్రికలో వచ్చిన కథనాన్ని నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న ఇంటర్నెట్ వినియోగదారులు ప్రమాద స్థితిపై అధికారులకు ఫేస్‌బుక్, వాట్సాప్ మేసేజ్‌లు పంపగా ఈ సమాచారం చివరికి ముఖ్యమంత్రికి చేరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడటంతో రైల్వే అధికారులు సోమవారం మరోమారు వంతెన పైకి పరుగులు తీశారు. రైల్వే ఇంజనీరింగ్ పరిభాషలో స్క్రిడ్ అరెస్టింగ్ పనులు చేపట్టారు. ప్రస్తుతం పక్కకు జరిగిన వంతెన బ్లాక్ ఇంకా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకమైన ఐరన్ బీమ్‌ల సాయంతో స్క్రిడ్ అరెస్టింగ్ చేశారు. ప్రస్తుతం పక్కకు జరిగిన బ్లాక్ కాకుండా దానికి ఇరువైపులా ఉన్న బ్లాక్‌లతో కలిపి మొత్తం 63 బీమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చనే అంచనాలతో సోమవారం కొన్ని బీమ్‌లు బిగించారు. అంచలంచెలుగా మరో రెండ్రోజుల్లో మొత్తం 63 బీమ్‌లతో వంతెన బ్లాక్‌లు పక్కకు జరగకుండా పటిష్ఠం చేయనున్నారు. తరువాత అత్యంత ఆధునిక జాకీల సాయంతో బ్లాకులను పైకి లేపి కిందికి జారిపోయిన బేరింగ్‌లను యథాస్థితికి తేవాల్సి ఉందని సిబ్బంది తెలిపారు. ఏదిఏమైనా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదం జరిగితే బ్లాక్‌లు ఏకంగా రైలు పట్టాలపై పడిపోతాయి. దాంతో రైళ్లకు, వంతెనపై వాహనాల రాకపోకలకు అవరోధం కలగడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రి చొరవతో ప్రమాదాన్ని, ఆర్థిక నష్టాన్ని నివారించినట్లైంది.

అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత
* రంగంలోకి సిఆర్‌డిఎ సిబ్బంది
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 16: ప్రణాళికాబద్ద అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్న అమరావతి రీజియన్ పరిధి ప్రాంతాల్లో అనధికార, అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చేదిలేదని, ఎలాంటి నిర్మాణాలపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఆర్‌డిఎ అధికారులు పేర్కొన్నారు. ఈసందర్భంగా నగర సమీపంలోని రామవరప్పాడు పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న పలు నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు భవన నిర్మాణ యజమానులకు పలు సూచనలు చేశారు. బల్లెం వారి వీధిలో జి ప్లస్ 2 అనుమతి తీసుకొని అదనంగా 3, 4 అంతస్తులను నిర్మిస్తున్నట్టు గుర్తించిన సిఆర్‌డిఎ అధికారులు ఆయా నిర్మాణాలపై ముందస్థు నోటీసులు జారీ చేశారు. సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ అదేశాల మేరకు రంగంలోకి దిగిన సిఆర్‌డిఎ ప్రమోషన్ విభాగం అధికారులు అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్థులను కూల్చివేశారు. భవన నిర్మాణ దరఖాస్తులను నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లోనే స్వీకరించడం జరుగుతుందని, లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా నిబంధనలకు ప్రకారం అనుమతి చేసుకొన్న ప్లాన్లకు తక్షణ అనుమతులను సైతం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే కేపిటల్ రీజియన్ పరిధిలో అనాథరైజ్డ్ లే అవుట్లలో ప్లాట్లను, అనుమతి లేని అపార్టుమెంట్ ఫ్లాట్లను వినియోగదారులెవ్వరూ కొనుగోలు చేయరాదని, భవిష్యత్తులో వాటికి ఎటువంటి అనుమతులు ఇవ్వబడని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమంలో సిఆర్‌డిఎ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్లు మృణ్మయి, గుమ్మడి ప్రసాదరావు, టిపిఎస్ బి మురళీగౌడ్, సర్వేయర్ ఎస్ వెంకటేశ్వర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ వై హేమంత్‌కుమార్, బి వెంకటేశ్, ఎస్ వెంకట జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.