కృష్ణ

దేశ రక్షణకు ప్రాణ త్యాగంచేసే ఏకైక వ్యక్తి పోలీసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 20: దేశ రక్షణకు ప్రాణ త్యాగం చేసే ఏకైక వ్యక్తి పోలీసేనని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల బలిదానాల ద్వారా ప్రజల కోసం, సమాజం కోసం దేనికైనా సన్నద్ధంగా ఉంటామనే సందేశాన్ని సమాజం నలుమూలలకు చేరేలా చూడాల్సిన బాధ్యత, వారి ఆశయ సాధనకు ముందుండి నడిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ ఎఎస్పీ శేఖర్, డిఎస్పీ మహబూబ్ బాషా, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

ముడ వైస్ చైర్మన్‌గా శ్యామ్‌ప్రసాద్

మచిలీపట్నం, అక్టోబర్ 20: మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) వైస్ చైర్మన్‌గా శ్యామ్‌ప్రసాద్ నియమితులయ్యారు. బంద రు ఓడరేవు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ సమీకరణ కోసం, పురాతన మచిలీపట్నం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ముడ విసిగా పని చేసిన ఎం వేణుగోపాలరెడ్డి గత జూలై 28వతేదీన వౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఒఎస్‌డిగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఒఎస్‌డిగా బదిలీ అయినప్పటికీ వేణుగోపాలరావే ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ విసిగా పని చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బందరు ఓడరేవు నిర్మాణాన్ని తక్షణమే నిర్మించాల్సి ఉంది. మరో యేడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. భూసమీకరణలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రెగ్యులర్ విసిగా పని చేసిన వేణుగోపాలరెడ్డి బదిలీ కావటంతో భూసమీకరణలో మరింత ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి ముడ వైస్ చైర్మన్‌గా 2009 సంవత్సరంలో గ్రూప్-1 ద్వారా డెప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన శ్యామ్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఖమ్మం జిల్లా పాల్వంచ, శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ఆర్డీవోగా పని చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా పని చేశారు. గత రెండు నెలల నుండి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆయన్ని ముడ వైస్ చైర్మన్‌గా బదిలీపై జిల్లాకు రానున్నారు.