విజయవాడ

గుడివాడ టిడిపిలో మళ్లీ రావివర్గం రాజీనామాస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ టిడిపిలో మళ్లీ రావివర్గం రాజీనామాస్త్రాలు
* గతంలో యలవర్తిని పార్టీలోకి రానివద్దని
* తాజాగా పిన్నమనేని వర్గానికి పదవులివ్వొద్దని
* దిద్దుబాటు చర్యలకు దిగిన బచ్చుల
* ఎన్టీఆర్ స్టేడియంలో చర్చలు
గుడివాడ, అక్టోబర్ 25: గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వర్గం మరోసారి రాజీనామా అస్త్రాలను సంధించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు బుధవారం దిద్దుబాటు చర్యలకు దిగడం చర్చనీయాంశమైంది. గతంలో ఒకసారి గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావును టిడిపిలోకి చేర్చుకోవద్దంటూ కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా ఉన్న లింగం ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు రాజీనామా అస్త్రాలను ప్రయోగించారు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ నెలల తరబడి నడిచింది. ఆ తర్వాత బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ, జిల్లాకు చెందిన మరో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకుని రావి వర్గానికి చెందిన కౌన్సిలర్లను శాంతింపజేయడంతో యలవర్తి వైసీపి నుండి టిడిపిలోకి చేరేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం టిడిపి జిల్లా కమిటీలో కార్యదర్శిగా ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వర్గానికి చెందిన తమ్మినేని రోమేశ్వరరావును నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల ఉత్తర్వులు అందజేశారు. దీంతో నందివాడ మండలంలోని రావి వర్గీయులు వరుసగా రాజీనామాలు చేస్తుండడంతో టిడిపి నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో బచ్చుల గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నందివాడ మండల టిడిపి అధ్యక్షుడు, గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ అరికేపూడి రామశాస్ర్తీ, కాళింగిపేటకు చెందిన మరో 50మంది కార్యకర్తలతో చర్చలు జరిపారు. పిన్నమనేని వర్గానికి చెందిన రోమేశ్వరరావు పార్టీ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనలేదని, జిల్లా కార్యదర్శి పదవి నుండి తప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే బచ్చుల మాత్రం జిల్లా మంత్రి దేవినేని ఉమా సూచనల మేరకు పిన్నమనేని వర్గీయునిగా ఉన్న రోమేశ్వరరావుకు కార్యదర్శి పదవి ఇచ్చినట్టుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. జిల్లా టిడిపి సభ్యుని పదవికి రాజీనామా చేసిన యలమంచిలి సతీష్ మాత్రం ఈ విషయాన్ని బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబుల దగ్గరే తేల్చుకుంటామని, బచ్చులను కలిసి చర్చించేది లేదని చెబుతున్నారు. దీంతో బచ్చుల నిర్వహించిన చర్చలు అసంతృప్తిగానే ముగిసినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నియామకం గుడివాడ పట్టణం, నందివాడ మండలాల్లో టిడిపికి వర్గ విభేదాలను మిగిల్చింది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన లింగం ప్రసాద్ కోట్ల రూపాయలను ఖర్చు చేసినా ఎక్కువ మంది టిడిపి కౌన్సిలర్లు గెలవకపోవడంతో ఆయన 20వ వార్డు కౌన్సిలర్‌గానే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రసాద్‌కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇదే పదవిని నందివాడ మండలం తమిరిశకు చెందిన కొల్లి పెదబాబు కూడా ఆశించడం, అలాగే ఇదే మండలం పోలుకొండకు చెందిన అరికేపూడి రామశాస్ర్తీ కూడా ప్రయత్నిస్తుండడంతో మూడేళ్ళ పాటు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రావి వర్గానికి చెందిన రామశాస్ర్తీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఇదే వర్గంలో కొనసాగుతున్న ప్రసాద్ వర్గం అసంతృప్తికి గురైంది. అలాగే పెదబాబు కూడా తనకు రాకపోవడంతో రామశాస్ర్తీ కమిటీకి అర్హత లేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఈ పరిస్థితుల్లో పిన్నమనేని వర్గానికి వచ్చిన పదవులను తొలగించాలని రావి వర్గం పట్టుబట్టడం టిడిపికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో పిన్నమనేని వర్గానికి తిరుగులేని నాయకత్వం ఉంది. జెడ్పీ చైర్మన్‌గా 30ఏళ్ళ పాటు దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆప్కాబ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆప్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన పిన్నమనేని చిట్టిబాబు దివంగత కోటేశ్వరరావుకు స్వయానా సోదరుడు. ఇదే వర్గం నుండి వచ్చిన పిన్నమనేని బాబ్జి గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సొంత వర్గం పిన్నమనేని కుటుంబానికి ఉండడం వారికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రావి, పిన్నమనేని వర్గాల మధ్య పెరుగుతున్న విబేధాలను పార్టీ అధిష్ఠానం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

ఆర్జేయుకెటి ప్రతిష్ట పెంచుదాం
*ఎస్‌పి సర్వశ్రేష్ఠి త్రిపాఠి
నూజివీడు, అక్టోబర్ 25: రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి సూచించారు. దీని ప్రతిష్ట పెంచేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆత్మహత్య, మృతి సంఘటనలను పురస్కరించుకుని స్థానిక ట్రిపుల్ ఐటీని బుధవారం ఎస్పీ త్రిపాఠి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ అధికారులతో మాట్లాడిన సమయంలో, ట్రిపుల్ ఐటీని పరిశీలించిన సమయంలో కొన్ని సమస్యలను గుర్తించామని చెప్పారు. సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ట్రిపుల్ ఐటీ అధికారులకు పలు సూచనలు చేశామని తెలిపారు. ట్రిపుల్ ఐటీలో భద్రత అంతంతమాత్రంగానే ఉందని, దీనిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాల సంఖ్యను మరిన్ని పెంచాలని సూచించామని చెప్పారు. సిసి కెమెరాల ఏర్పాటు వల్ల చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని, వీటిని నియంత్రించేందుకు జామర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల హాజరు పెరిగేందుకు బయోమెట్రిక్ సిస్టం ను పూర్తి అమలు చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించామని తెలిపారు. ట్రిపుల్ అధికారులు- అధ్యాపకులు మధ్య కొంత సమన్వయలోపం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నూజివీడు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు వల్ల సమస్య పరిష్కారం కాదని, పోలీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్త పోలీసులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని, నాలుగైదు నెలల్లో వస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్‌పి వి శ్రీనివాసరావు, సిఐ రామ్‌కుమార్, ఎస్‌ఐ సిహెచ్ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

2019కల్లా పోలవరం పూర్తిచేయాలి
నూజివీడు, అక్టోబర్ 25: 2019 నాటికి పోలవరం పనులు పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కోరినట్లు జిలా టిడిపి ఉపాధ్యక్షుడు అట్లూరి రమేష్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో గడ్కరీని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కలసి సత్కరించినట్లు స్థానిక విలేఖరులకు ఫోన్‌లో తెలిపారు. ఈ సందర్భంగా అట్లూరి రమేష్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, రైతుల కళ్ళలో ఆనందం చూస్తామన్న విషయాన్ని మంత్రి గట్కరీకి వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారని రమేష్ వివరించారు.

పిల్లివానిలంకలో అడ్డగోలు ఇసుక తవ్వకాలు
* అడ్డుకున్న పిల్లవానిలంక ప్రజలు
* వాల్టా చట్టానికి తూట్లు
* కనె్నత్తి చూడని అధికారులు

తోట్లవల్లూరు, అక్టోబర్ 25: మండలంలోని భద్రిరాజుపాలెం - పిల్లివానిలంక మధ్య కృష్ణానదీపాయలో దిలీప్ బిల్డికన్ కంపెనీ చేపట్టిన బుసక తవ్వకాలను బుధవారం పిల్లివానిలంక గ్రామస్థులు అడ్డుకున్నారు. గత పది రోజులుగా బుసక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ప్రజలు తూమాటి కేశవరావు, అశే్లటి అంజమ్మ, పిల్ల చంటి, చిన్నం కుమారి, పిల్లి సుబ్బారావు, చిన్నం కేశవరావు, మారుపూడి జ్యోతి, తోకల రుషికన్య, తూమాటి సునీత తదితరులు ఆరోపించారు. భద్రిరాజుపాలెంకు చెందిన పలువురు రైతుల పట్టా భూములు కృష్ణానది ఇసుకపాయ పక్కన ఉన్నాయి. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులకు బుసక కోసం దిలీప్ కంపెనీ 12 ఎకరాలలో మైనింగ్‌శాఖ నుంచి అనుమతి తీసుకుంది. అనుమతి పొందిన భూముల్లో కేవలం 2.5 మీటర్ల లోతున బుసక తవ్వాలని పేర్కొన్నారు. అయితే రెండు పొక్లెయిన్లతో సుమారు 20 అడుగుల లోతున బుసక తవ్వకం చేపట్టారు. ప్రారంభంలో 2.5 మీటర్ల లోతుతో తవ్వకాలు మొదలు పెట్టిన కంపెనీ సిబ్బంది రానురాను అగాధంలా తవ్వేశారు. ఈ తవ్వకాలను తెలుసుకున్న పిల్లివానిలంక ప్రజలు బుధవారం తవ్వకాల ప్రదేశానికి తరలి వచ్చారు. కృష్ణానదీపాయకు వరద వస్తే పక్క పొలాలు కోతకు గురై తమ గ్రామానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వందమంది గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో కంపెనీ సిబ్బంది వెంటనే బుసక తవ్వకాలను నిలిపివేశారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. గ్రామానికి దగ్గర్లో దారుణంగా బుసక తవ్వకాలు జరిపితే సహించమని ప్రజలు ఎదురు తిరిగారు. కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాన్ని ప్రమాదం అంచుకు తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా అనుమతులు
ఇదిలాఉండగా బుసక తవ్వకాలకు అనుమతులు వాల్టా చట్టానికి విరుద్ధంగా ఇచ్చారని ప్రజలు ఆరోపించారు. వ్యవసాయ బోర్లకు 500 మీటర్ల దూరంలో మాత్రమే ఇసుక, లేదా బుసక, మట్టి తవ్వకాలు చేపట్టాలని వాల్టా చట్టం చెబుతున్నందునే మండలంలో ఏడు క్వారీలను మూసివేశారని, అలాంటప్పుడు ఇక్కడ బోర్లు పక్కనే 20 అడుగుల లోతున తవ్వకాలు ఎలా చేస్తారని ప్రజలు ప్రశ్నించారు. తహశీల్దార్ వివరణ: రైతుల పట్టా భూముల్లో బుసక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, 2.5 మీటర్ల లోతున తవ్వాలని మైనింగ్ అధికారులు పేర్కొన్నారని తహశీల్దార్ జి భద్రు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతున్నట్టు తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భద్రు తెలిపారు.

ఇది చేతకాని అసమర్ధ ప్రభుత్వం
* హామీల వైఫల్యంపై బహిరంగ చర్చకు సవాల్
* సుబాబుల్ టన్నుకు రూ.6వేలతో కొనుగోలు చేయించాలి
* వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పార్థసారథి విమర్శ
* ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలి: సామినేని
చందర్లపాడు/నందిగామ, అక్టోబర్ 25: ఇది చేతకాని అసమర్ధ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు, సుబాబుల్ రైతు పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఎస్‌పిఎం కంపెనీ బకాయిలను చెల్లించి, టన్ను 6వేల చొప్పున కంపెనీలతో కొనుగోలు చేయించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సుబాబుల్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని, సుబాబుల్ రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు బుధవారం చందర్లపాడు మండల కేంద్రం నుండి నందిగామ వరకూ 20కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించారు. చందర్లపాడులో దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని శివాలయం, సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా బయలుదేరి మార్గమధ్యలో పత్తి, మిర్చి, సుబాబుల్ పంట పొలాలను పరిశీలించి రైతులు, రైతు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముప్పాళ్ల గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు హరతులు ఇచ్చి స్వాగతం పలకగా చందాపురంలో బొగ్గవరపు రవీంద్ర ఆధ్వర్యంలో యువకులు ఘన స్వాగతం పలికారు. రాత్రి నందిగామ గాంధీ సెంటర్ వద్ద కోటేరు ముత్తారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో జిల్లా పార్టీ ఇన్‌చార్జి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను తదితరులు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దోపిడీ పాలన సాగిస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్థసారథి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రవాణా ఖర్చులు భరిస్తూ కంపెనీలు సుబాబుల్ కర్ర టన్ను రూ.4400లతో కొనుగోలు చేయగా నేడు ఆ ధర లభించకపోగా రవాణా ఖర్చుల భారం రైతుపైనే వేస్తున్నా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతమొందించాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని, కాగ్ నివేదికల్లోనూ అవినీతి జరుగుతోందని వెల్లడైందన్నారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం రాష్ట్ర నాయకురాలు యార్లగడ్డ జోయ, వైకాపా నాయకులు ముక్కపాటి నర్శింహరావు, కోవెలమూడి వెంకట నారాయణ, కోట బుచ్చయ్య చౌదరి, కొమ్మినేని రవిశంకర్, కొండా కృష్ణారెడ్డి, చల్లా బ్రహ్మేశ్వరరావు, మంగునూరు కొండారెడ్డి, వెలగపుడి వెంకటేశ్వరరావు, బండి జానకిరామయ్య, కత్రోజు శ్రీనివాసాచారి, నెలకుదిటి నాగేశ్వరరావు, అవుల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

బాలికపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు
జగ్గయ్యపేట, అక్టోబర్ 25: పట్టణ సమీపంలోని తొర్రకుంటపాలెంకు చెందిన 12ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ డిఎస్‌పి రాధేష్ మురళి తెలిపారు. వీరిలో జి చిట్టిబాబు, పి గోపిలను విలేఖరుల సమావేశంలో ప్రవేశపెట్టగా మిగిలిన ఇద్దరూ మైనర్‌లు కావడంతో వారి వివరాలు తెలిపారు. బాలిక దసరా సెలవులకై తల్లిగారింటికి రాగా నిందితులు అత్యాచారం చేశారని, బాలిక తల్లి ఈ నెల 22 రాత్రి పిర్యాదు చేయగా తమ విచారణలో నలుగురు నిందితులుగా తేలినట్లు పేర్కొన్నారు. వీరిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సిఐ లచ్చునాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రియకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

డెల్టా షుగర్స్‌లో క్రషింగ్ జరిపేలా ఒత్తిడి తీసుకువస్తాం
* రైతులకు, కార్మికులకు ఎమ్మెల్యే వంశీ హామీ
హనుమాన్ జంక్షన్, అక్టోబరు 25: 2017-18 సీజనుకు డెల్టా షుగర్స్‌లో క్రషింగ్ జరిపేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తామని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీమోహన్ హామీ ఇచ్చారు. నష్టాలపేరుతో ఈఏడాది చెరకు క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు డెల్టా యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏరియా రైతులతో వంశీ మోహన్ డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ అవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ రైతుసంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చిట్నేని శివరామకృష్ణ తదితరులు హాజరయ్యారు. హనుమాన్ షుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమావరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు నాయకులు, కార్మిక సంఘాల నాయకులు డెల్టా యాజమాన్యం తీరును ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యం వున్నా ఫ్యాక్టరీలో వ్యక్తిగతంగా డెల్టా యాజమాన్యం నిర్ణయం ఏలా తీసుకుంటుందని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా, రైతులు, కార్మికుల ప్రయోజనాలను నష్టపరిచేలా వ్యవహారిస్తే పోరుబాట తప్పదని హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గ మాజీశాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డెల్టా యాజమాన్యం చర్యలను ఖండిస్తున్నానని, రైతులు ఆందోళనకు దిగకముందే క్రషింగ్‌ను ప్రారంభించాలని కోరారు. గన్నవరం శాసనసభ్యుడు వంశీ మోహన్ మాట్లాడుతూ ఈసమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అయిల్‌పామ్ రాష్ట్ర అధ్యక్షుడు బోబ్బా వీరరాఘవరావు, విజయ డెయిరీ డైరేక్టర్ చలసాని అంజనేయులు, ఏపెక్స్ కమీటీ చైర్మన్ ఆళ్ళ గోపాలకృష్ణ, రైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, కలపాల సూర్యనారయణ, వేగిరెడ్డి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లలు లేని భాష చిత్రకళ
* ఆచార్య సుంకరి
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 25: ఎల్లలు లేని భాష చిత్రకళ అని కృష్ణా విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యతో పాటు కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు ఆంధ్ర జాతీయ కళాశాలలో విద్యార్థిగా, అధ్యాపకుడుగా పనిచేసి ఎనలేని ఖ్యాతి గడించారన్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు ప్రమోద్ కుమార్ చటర్జి వద్ద బాపిరాజు చిత్రకళను అభ్యసించారన్నారు. మేటి చిత్రకారుడు బాపిరాజు నడయాడిన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించడం ముదావహమన్నారు. రుద్రవరంలో నిర్మించే విశ్వవిద్యాలయ నూతన భవన సముదాయంలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, కడప యోగి వేమన విశ్వ విద్యాలయానికి చెందిన డా. కె మృత్యుంజయరావు, గుంటూరు కేంద్రీయ విద్యాలయం ఆర్ట్ మాస్టర్ టేకి మృత్యుంజయరావు, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ప్రతినిధులు పిఎస్‌ఎస్ ప్రసాద్, బిఎస్‌వి రమేష్, కళాకారులు పాల్గొన్నారు. డా. మోకా లీలారాణి(మచిలీపట్నం), పి లాలిత్య (కరీంనగర్), కెఎల్‌ఎన్ సాయిశ్రీ(హైదరాబాద్ జెఎన్‌టియు), సిహెచ్ ఉష(విజయవాడ), వి భాషిత(మచిలీపట్నం)ల చిత్రాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి.

ఇంటి నుండి పారిపోయిన ఇద్దరు విద్యార్థినులు
చల్లపల్లి, అక్టోబర్ 25: అమ్మకొట్టిందని, అధ్యాపకులు కేకలు వేశారని ఇద్దరు విద్యార్థినులు ఇంటి నుండి పారిపోయిన సంఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక నారాయణరావునగర్‌కు చెందిన కందుల నాంచారమ్మ, నిమ్మలతోటకు చెందిన సునీతపు పద్మినిలత అవనిగడ్డలోని దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం ఉదయం ఇరువురు విద్యార్థినులు యథావిధిగా కళాశాలకు వెళుతున్నట్లు ఇంటి నుండి బయలుదేరారు. మీ పిల్లలు కాలేజీకి రాలేదని తల్లిదండ్రులకు ఫోన్‌లో అధ్యాపకులు చెప్పటంతో ఖంగారు పడిన తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. చల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ డి చంద్రశేఖర్ పలు కోణాల్లో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు ఇద్దరు విద్యార్థినులు తాము మచిలీపట్నంలో ఉన్నామంటూ సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మ కొట్టిందని ఒకరు, అధ్యాపకులు కేకలు వేశారని ఇంకొకరు భయపడి మచిలీపట్నంలో ఉన్న నాంచారమ్మ బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్లు యువతులు పోలీసులకు తెలిపారు. వారి నుండి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు వారిని స్థానిక పోలీసు స్టేషన్‌లో తల్లిదండ్రులకు అప్పగించారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ డిఎస్పీ వి పోతురాజు విద్యార్థినుల నుండి వివరాలు సేకరించారు.

కూరగాయల ధరలకు రెక్కలు
* కార్తీకమాసం ప్రభావం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 25: సరిగ్గా వారం రోజుల క్రితం కార్తీకమాసం ఆరంభమైంది. ఇదే సమయంలో భవానీ దీక్షలు, అయ్యప్ప దీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. దీని ప్రభావంతో 40 శాతం మంది మాంసాహారం మానేశారు. అయితే దీని ప్రభావం మాంసం ధరలపై ఏమాత్రం కనిపించలేదు. ప్రస్తుతం మటన్ కిలో ధర రూ. 550లు, చికెన్ ధర రూ. 180లు పలుకుతోంది. గతంలో ఇదే సీజన్‌లో చికెన్ ధర రూ. 120లు వరకు వెళ్లింది. 2,3 మాసాల క్రితం కూడా రూ. 140లు ఉంది. కార్తీకమాసం వచ్చినా ధరలు తగ్గకపోవడం గమనార్హం. సహజంగానే కార్తీక మాసం కావడంతో కూరగాయల ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు సగటు కిలో రూ. 40లుపైగానే పలుకుతున్నది. సాధారణంగా కార్తీకమాసంలో ముఖ్యంగా ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. కాని ఈ దఫా అన్ని రకాల కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. సకాలంలో వర్షాల వల్ల పంట దిగుబడి సక్రమంగా ఉన్నప్పటికీ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధరలను పెంచేస్తున్నారు. ముఖ్యంగా చిక్కుడు ధర రూ. 70లకు చేరింది. క్యారెట్ రూ. 55ల నుంచి రూ. 65ల వద్ద తారాడుతోంది. గుత్త మార్కెట్‌లో 10 కిలోల ధర రూ. 60లు ఉండగా ప్రస్తుతం రూ. 70లకు విక్రయిస్తున్నారు. అలాగే క్యాప్సికం, బీన్స్ ధరలు రూ. 80ల వరకు చేరింది. దొండ రూ. 30ల నుంచి రూ. 40లకు, వంకాయ రూ. 40లకు, బెండ రూ. 25లకు చేరింది. కొత్తిమీర ధర అమాంతం రూ. 40ల నుంచి రూ. 60లకు చేరింది. ఇక బహిరంగ మార్కెట్‌లో ఎవరి ఇష్టానుసారం వారిది, వీధుల్లో చిక్కుళ్లు, క్యారెట్ రూ. 100లకు చేరింది. ఇక ప్రధానమైన కిలో ఉల్లిధర రైతుబజారులో రూ. 23 ఉండగా అవి రూ. 35కు చేరాయి. బయట మార్కెట్‌లో టమోటా 2 రకాలు మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు అదేమని ప్రశ్నిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు ధ్వంసమయ్యాయని సాకు చూపుతున్నారు.

ఫొటొలు విఎంసిలో ఉన్నాయి
01 నుంచి 03 వరకూ ... పటమట రిలయన్స్ ఫ్రెష్ వ్యాపార సముదాయంలో పన్ను వినియోగ తేడాలపై క్షేత్రస్థాయి కొలతలు నిర్వహిస్తున్న విఎంసి రెవెన్యూ డెప్యూటీ కమిషనర్ సుబ్బారావు
వాణిజ్య భవనాల కొలతలపై
కదిలిన యంత్రాంగం
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 25: నగరంలోని వ్యాపార సముదాయాలు, భవనాల పన్ను చెల్లింపుల తేడాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్న కమిషనర్ జె నివాస్ ఆదేశాల ప్రకారం విఎంసి రెవెన్యూ అధికారులు భవనాల కొలతలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విఎంసి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ జి సుబ్బారావు నేతృత్వంలో బుధవారం ఉదయం నగరంలోని రెండు పెద్ద వ్యాపార, దుకాణ సముదాయ భవనాలను కొలిచిన అధికారులు కొన్ని తేడాలను గుర్తించడం విశేషం. మూడవ సర్కిల్ పరిధిలోని పటమటలోని రిలయన్స్ ఫ్రెష్ సముదాయంతోపాటు మొదటి సర్కిల్ పరిధిలోని 27వ రెవెన్యూ డివిజన్ భవానీపురంలో మరో భవన కొలతల తేడాలపై పరిశీలన చేశారు. నగరంలో లక్షా 90 వేలకు పైగా అసెస్‌మెంట్లు ఉండగా వీటిలో దారిద్య్రరేఖ దిగువనున్న నిరుపేదల గృహాలు తప్పిస్తే మిగిలిన వాటిలో కేవలం యాభై, అరవై శాతం శాతానికి మించి పన్ను చెల్లింపుదారులు లేరన్నది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 40శాతం భవనాలు వ్యాపార వినియోగంలో ఉన్నట్టు అంచనా కాగా వీటిలో కొన్నింటికి వ్యాపార వినియోగం ఉన్నా నివాస పన్నుగానే చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని వ్యాపార దుకాణాలను నిర్మించి వినియోగిస్తున్నా పన్ను చెల్లింపులో మాత్రం రెసిడెన్షియల్ పన్నుగానే జరుగుతోంది. తీసుకొన్న ప్లాన్ కు విరుద్ధంగా అనధికార, అక్రమ నిర్మాణాలు జరిపి వాటిని కూడా వ్యాపార వినియోగం చేస్తున్నారు. సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, సెట్ బ్యాక్‌లు ఇలా భవన ఆవరణలో అడుగైనా ఖాళీ స్థలం లేకుండా వ్యాపార, నివాస అవసరాలకు వినియోగిస్తున్న వైనంతో విఎంసి ఆయా అనధికార వినియోగానికి పన్ను ఆదాయం కోల్పోతోంది. కొంత మంది తమ భవనానికి పన్ను విధింపు ప్రక్రియ జరిగిన తరువాత ఇటువంటి అనధికార నిర్మాణాలు జరుపుతారు. ఇలా ఒకటి రెండు కాదు దశాబ్ధాల తరబడి స్థలం వినియోగంలో ఉన్నా పన్ను చెల్లించని ఉదంతాలు అనేకమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పన్ను వసూలులో తేడాతోపాటు విఎంసి ఖజానాకు భారీ స్థాయిలో నష్టవాటిల్లుతోందన్న విషయం బహిరంగ రహస్యమే. అంతేకాకుండా భవనాల పన్ను విధింపు ప్రక్రియలో సంబంధిత అధికారులు కొంత మంది కాసుల కోసం కక్కుర్తిపడి నిబంధనల ప్రకారం విధించాల్సిన పన్ను కాకుండా తక్కువ పన్ను విధింపు చర్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈనేపథ్యంలో విఎంసి ఖజానాకు మెరుగైన ఆదాయం సమకూర్చాలన్న లక్ష్యంతో విఎంసి కమిషనర్ జె నివాస్ పన్ను తేడాలపై దృష్టిసారించి ఆ దిశగా విఎంసి రెవెన్యూ అధికారులను సమాయత్తపర్చారు.

సిటీ, కృష్ణా
సిఎం ఆకస్మిక తనిఖీలో గుర్తించిన
సమస్యలు పరిష్కరించాలి
* అధికారులకు కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 25: ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలో గుర్తించిన సమస్యలను సంబంధిత శాఖాధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. ఈ నెల 14న సిఎం పర్యటనలో గుర్తించిన పనులను క్షేత్రస్థాయిలో బుధవారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ కొండ, పరిసర ప్రాంతాల్లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఏలూరు, బందరు రైవర్స్ కాలువలను క్లీనింగ్‌తోపాటు గట్ల వెంబడి గ్రీనరితో అభివృద్ధి చేయాలన్నారు. జల రవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. గన్నవరం వరకు జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ పరిధిలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు రహదారుల పరిసరాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా పంచాయతీ శాఖ అధికారిని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అనుకూలంగా ట్రాఫిక్ ఐ ల్యాండ్ డిజైన్‌ను రూపొందించాలని సిఆర్‌డిఎ అధికారులను కోరారు. రామవరప్పాడు బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. బుడమేరు బండ్ గ్రీనరీకి అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో వినియోగంలో లేని పాడుపడిన భవనాలను తొలగించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ చేపట్టి నూతన భవనాల నిర్మాణాలకు, పార్కింగ్‌కు అవసరమైన లే అవుట్ తయారు చేయాలన్నారు. జాతీయ రహదారులో గోతులు, గుంటలను తక్షణమే పూడ్చి వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక వాల్‌పెయింటింగ్స్, పోస్టర్లను తక్షణమే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల ప్రగతిని సమీక్షిస్తూ జనవరి ఒకటో తేదీ నుండి ట్రాఫిక్‌ను అనుమతించడం జరుగుతుందని ఈ లోపుగా స్పాన్స్ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల ప్రగతిపై ప్రతివారం సమీక్ష జరుగుతుందని క్షేత్రస్థాయి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో జెసి 2 పి బాబురావు, మున్సిపల్ కమిషనర్ జె నివాస్, ఆర్డీవో ఎస్ హరీష్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఇ రామకృష్ణ, ఎపి అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వై రామారావు, ట్రాఫిక్ అడిషనల్ డిసిపి నాగరాజు, అడ్మిన్ అడిషనల్ డిసిపి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందరికీ ఆమోదయోగ్యంగా విఎంసి బడ్జెట్
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 25: విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన బడ్జెట్ రూపకల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. 2018-19 వార్షిక బడ్జెట్ అంచనాల తోపాటు 2017-18 రివైజ్డ్ బడ్జెట్ అంచనాల రూపకల్పనలపై బుధవారం ఉదయం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో 1,2,3 సర్కిల్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి సమగ్రమైన నివేదిక తయారుచేయాలని, ఇందుకు స్థానిక కార్పొరేటర్ల సూచనలు, సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ముఖ్యమైన పనుల ప్రాధాన్యతను గుర్తించి బడ్జెట్ కేటాయింపులలో ప్రా ముఖ్యత ఇవ్వాలన్నారు. నగరమంతా చేపట్టబోయే పనుల కోసం వార్డుల వారీగా బడ్జెట్‌ను రూపొందించాలన్నారు. రానున్న వార్షిక విఎంసి బడ్జెట్ నగర ప్రజలందరికీ ఆమోదయోగ్యం గా ఉండాలన్నారు. ప్రజావసరాలను గుర్తించి వాటి కార్యాచరణకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగాలన్నారు. ఇప్పటివరకూ డివిజన్లకు కేటాయించి న నిధులు వాటి వినియోగంతోపాటు ఆయా అభివృద్ధి పనుల సారూప్యతలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. బడ్జెట్‌లో పొందుపర్చిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్త య్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఎస్‌ఇ జెవి రామకృష్ణ, ఇఇ లు కె కోటేశ్వరరావు, జె శ్రీనివాస్, సుహాసిని, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

రాజధాని యువతకు
ఉద్యానవనాల అభివృద్ధిపై శిక్షణ
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పచ్చలహారంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గార్డెనర్స్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. రాజధాని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు గాను అమరావతి గ్రామాలలోని యువతకే ఈ శిక్షణలో ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. శాఖమూరులో ప్రాంతీయ ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నందున ఈ ఉద్యానవనాన్ని మరింత అందంగా తీర్చిదిద్దటానికి అమరావతి అభివృద్ధి సంస్థ, ఎపి అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సంయుక్త నిర్వహణలో 30 మంది నిరుద్యోగ యువత ఎంపిక చేయగా వీరి శిక్షణా కార్యక్రమాన్ని కేదరేశ్వరపేటలోని ఎపియుజిబిసి ప్రధాన కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేటి పర్యాటక ఉద్యానవనంగా అభివృద్ధి కానున్న శాఖమూరు ఉద్యానవనాన్ని సిఎం చంద్రబాబునాయుడు ఆలోచనలకనుగుణంగా రూ పుదిద్దనున్నట్టు తెలిపారు. 4వారాల పా టు జరిగే ఈ శిక్షణా శిబిరాన్ని అంద రూ సద్వినియోగం చేసకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఎపియుజిబిసి జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్సు ఎస్ ముస్త్ఫా, కోర్సు డైరెక్టర్ శివప్రసాద్, ఎడిసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం చంద్ర ఓబుల్‌రెడ్డి, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్ విజయలక్ష్మీ, ఎపి సిఆర్‌డిఎ డిసిడిఓ శ్రీనివాసరావు, సీనియర్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ కె పుండరీకాక్షుడు తదితరులు పాల్గొన్నా

దక్షిణ భారత అంతర్ విశ్వ విద్యాలయాల
హ్యాండ్‌బాల్ ఛాంపియన్ కృష్ణావర్శిటీ
* రెండోస్థానంలో అన్నా యూనివర్శిటీ
* మూడు, నాలుగు స్థానాల్లో పెరియార్, భారతీయార్
విజయవాడ(స్పోర్ట్స్), అక