విజయవాడ

ఎన్‌జీటీ తీర్పు పట్ల టీడీపీ వర్గాల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 17: అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం పట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ కార్యదర్శి గనె్న వెంకట నారాయణ ప్రసాద్ నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని పండగ చేసుకున్నారు. ఈ సందర్భంగా గనె్న మాట్లాడుతూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోచూసిన ప్రతిపక్ష నాయకులకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. పరిరక్షణ సంఘాల ముసుగులో వైసిపి నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం అనుకూలంగా రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాగబాబు, మహ్మద్ షేక్, ఫైజాన్, కృష్ణబాబు, పడాల గంగాధర్, సల్మాన్, తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా
వీఎంసీ కార్తీక వన సమారాధన
* ఆట, పాట, స్టెప్పులతో అదరగొట్టిన మేయర్ శ్రీ్ధర్, కమిషనర్ నివాస్

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: కార్తీక వన సమారాధనలో భాగంగా శుక్రవారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి పిన్నంరాజు గార్డెన్స్‌లో జరిగిన వీఎంసీ వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధికార, ఉద్యోగులతోపాటు నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్, కమిషనర్ జె నివాస్, కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు స్టేజీ మీద ఆట, పాట నృత్యాలు చేసి వీక్షకులను ఆనందపర్చారు. తొలుత వనాలను సంరక్షించడమే కాకుండా ఆరాధించాలన్న ఉద్దేశ్యంతో ధాత్రీ వృక్ష పూజలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజచేసి శాస్త్రోక్తంగా ప్రారంభించిన వన సమారాధనలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ అందరూ సమిష్టిగా అనందిస్తూ సహపంక్తి భోజనాలు చేసి సంతోషాలను పంచుకోవడమే కాకుండా ప్రకృతిని ఆరాధించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ప్రతి రోజూ ఉద్యోగ విధుల్లో బిజీగా గడిపే ఉద్యోగులకు ఆట విడుపుగా వన సమారాధన ఉంటుందన్నారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలలో వన సమారాధనకు ఎంతో విశిష్టత ఉందని, దానిని పరిరక్షించడమే కాకుండా భవిష్యత్తు తరాల వారికి తెలియజేయడం అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో మరింత ఉత్సాహంగాను, సంతోషంగాను జీవించవచ్చన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు భాష ప్రాచూర్యంపై నిర్వహించిన ప్రశ్నలు-జవాబుల కార్యకమంలో సరైన జవాబులు తెలిపిన వారికి వెండి నాణేలను బహూకరించారు. మధ్యాహ్నం కార్పొరేటర్లు, అధికార, ఉద్యోగులకు సంయుక్తంగా నిర్వహించిన వాలీబాల్, మ్యూజికల్ చైర్, షటిల్ బ్యాట్మింటన్, రింగ్, షాట్ పుట్, వాలీబాల్ తదితర ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.