విజయవాడ

పోలవరం పరిశీలనకు తెలుగు యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: జిల్లా తెలుగుయువత బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ ఆధ్వర్యాన ప్రత్యేక బృందం మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్ళారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జాతీయ పార్టీ మీడియా కన్వీనర్, గిడ్డంగుల శాఖ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలుగు యువత ద్వారా గ్రామాల్లో సామాన్య ప్రజానీకానికి తెలిసేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. పోలవరం ప్రాజక్టు పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. పోలవరం నిర్మాణ పనులు మూడున్నరేళ్లలో జెట్‌స్పీడుతో చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ప్రాజెక్టుల నిర్మాణంపై ఈవిధంగా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబేనన్నారు. దేవినేని చందు మాట్లాడుతూ నిర్మాణలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మీదట యువత గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడమే పరిశీలన ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, ఉపాధ్యక్షుడలు ఎర్రంశెట్టి రామాంజనేయులు, అట్లూరి శివ, తోట సందీప్, కృష్ణబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.