విజయవాడ

ప్రజాభాగస్వామ్యంతోనే నవ్యాంధ్ర నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 3: ప్రజాభాగస్వామ్యంతోనే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల సందర్భంగా రెండోరోజైన శుక్రవారం ఆయన స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు ఈనెల 7 వరకూ నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర విభజన అడ్డగోలుగా సాగిందన్నారు. అప్పులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించి ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో అడ్డగోలుగా తలుపులు వేసుకుని చీకట్లోనే విభజన బిల్లును ఆమోదించారని ఇది చరిత్రలో చీకటి రోజన్నారు. దీని వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం, ద్రోహం జరిగిందన్నారు. ఈ కారణంగా దాదాపు 16 వేల కోట్ల అప్పులు అప్పగించారన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్రాన్ని ఎలా పాలన చేయాలన్నారు. ఐనప్పటికీ ఎంతో సమయస్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఎక్కడా లోటు లేకుండా అన్ని వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితులలో కేంద్ర సాయం ఎంతో అవసరమై ఉందన్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సాయం తీసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుని ఆ మేరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు. అందరి భాగస్వామ్యంతోనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అంతేగాక రాష్ట్ర విభజనపై ఈనెల 7వరకూ ప్రతిరోజూ చర్చా వేదికను ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను, మేధావులు, పురప్రముఖులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, కార్యకర్తలతో చర్చాగోష్టిని ఏర్పాటు చేసి విభజన తీరును వివరించాలన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాన్ని తెలియజేసి వారి నుండి సూచనలు, సలహాలను తీసుకోవాలన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని కోరాలన్నారు. ఎంపిడిఓ నాయకత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఈనెల 7 వరకూ ఇదే కల్యాణ మండపంలో నిర్వహించాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలెదురైనా ఎన్నికల హామీలను నెరవేర్చటంలోగానీ, రాష్ట్రాన్ని 2050 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దటంలోగానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, జడ్పీటిసి దొండపాటి రాము, సర్పంచ్ నందేటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ షేక్ షహానాబేగం, వైస్ ఎంపిపి శోభన్‌బాబు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.