కృష్ణ

పెరుగుతున్న నీటి కాలుష్య మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 3: నీటి కాలుష్యం బారిన పడిన మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎపి ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలాజీ విద్యాలయంలో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆచార్య సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ నీటి కాలుష్యం కారణంగా అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, హృద్రోగాలు ఎక్కువయ్యాయని ప్రజలు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో ఉన్న మంచినీటి చెరువులను తెలిసి తెలియకుండానే మనమే కలుషితం చేస్తున్నామన్నారు. మంచినీటి అవసరాలు తీర్చే చెరువుల్లో పశువులు దొర్లడం, బట్టలు ఉతకడం వంటి చర్యలు చాలా గ్రామాల్లో చేస్తున్నారని, ఫలితంగా నీరు కలుషితమై ఆ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో కూడా రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలుషిత ఆహారాన్ని తీసుకోవల్సిన పరిస్థితి నేడు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు గాను మొక్కల పెంపకాన్ని చేపట్టామన్నారు. ప్రధాన రహదారిలోని డివైడర్‌లో మొక్కల పెంపకంతో పాటు పార్కులు, స్కూల్స్‌లో కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టామన్నారు. ఫారెస్ట్ అధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ వర్షపాతాన్ని రెగ్యులేట్ చేసే అడవుల ద్వారానే ఎక్కువ మొత్తంలో వర్షపునీరు భూమిలోకి ఇంకింప చేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి సత్యనారాయణ, పర్యావరణ విద్యా కేంద్రం అధికారి వెంకటరత్నం, బాలాజీ విద్యాలయం ప్రిన్సిపాల్ కె చంద్రశేఖర్, కృష్ణా వర్సిటీ బయోటెక్ విభాగం ప్రొఫెసర్ బ్రహ్మచారి పాల్గొన్నారు.