విజయవాడ

19నుండి జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 17: ప్రీ ఇంజినీర్డ్ స్ట్రక్చర్స్ సోసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఈనెల 19 నుండి 21వరకు నగరంలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో పెప్స్‌కాన్ పేరుతో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పిఎస్‌ఐ కార్యదర్శి సిఎ ప్రసాద్ తెలిపారు. బుధవారం నగరంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పిఎస్‌ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే మూడుసార్లు జాతీయ సదస్సులు నిర్వహించామని, ఈసారి నగరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 19న సదస్సు ప్రారంభమవుతుందని, 20న సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రీ ఇంజనీరింగ్, ప్రీ కాస్ట్ నిర్మాణాలు, ఇతర నిర్మాణ నైపుణ్యతలు షార్ట్‌క్రీట్ లాంటి ధ్వని ఉష్ణనిరోధక పద్ధతులపై జరుగుతుందన్నారు. నిర్మాణసంస్థలు, డెవలపర్స్‌కు ప్రీకాస్ట్‌పై అవగాహన వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. బిల్డర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రభుత్వ ఇంజనీర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని, స్మార్ట్ సిటీల అభివృద్ధి త్వరగా జరగాలంటే ప్రీకాస్ట్ విధానం ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని పేర్కొన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో ఎపి టిడ్‌కో ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వి రామ్‌నాథ్, పి సూర్యప్రకాష్, వి రాంప్రసాద్, డా బి పాండురంగరావు, తదితరులు పాల్గొన్నారు.