విజయవాడ

అంతర్జాతీయ బహుభాషా కవితా సంపుటికి లిమ్కా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: భాష జాతిని బతికిస్తుందని ఈ ఉద్యమంలో కవులు ఎనలేని పాత్రను పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ దర్ఘాసి విజయభాస్కర్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో జరిగిన అమరావతి పొయిటిక్ ప్రిజమ్ -2016కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవపత్ర ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్లుగా అంతర్జాతీయ కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ కవితా సంపుటాలను వెలువరిస్తున్న మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ వై.హరిశ్ఛంద్ర ప్రసాద్‌ను ఆయన అభినందించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ, హరిశ్చంద్ర ప్రసాద్ సాంస్కృతిక రాయబారిగా వ్యవహరిస్తున్నారని, అందుకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ చేయూత నివ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ రంగం కూడా పాలుపంచుకుంటుందన్నారు.
తొలుత కవి సమ్మేళన క్యూరేటర్, కల్చరల్ సెంటర్ గౌరవ సలహాదారు పద్మజా అయ్యంగార్ గత మూడేళ్లుగా జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనాలపై నివేదిక సమర్పించారు. జెమినీ టీవీ కిరణ్, మాలక్ష్మీ ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మండలి శుభాకాంక్షలు తెలియజేశారని స్వాగతోపన్యాసంలో హరిశ్చంద్రప్రసాద్, కల్చరల్ సెంటర్ లక్ష్యాలను, సాధించిన విషయాలను వివరించారు. 2016వ సంవత్సరంలో కల్చరల్ సెంటర్ నిర్వహించిన అమరావతి పొయెటిక్ ప్రిజమ్‌కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సర్ట్ఫికేట్‌ను సురేష్ బాబు ఆవిష్కరించారని కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం నగరానికి చెందిన కవులు డాక్టర్ కాంటూరు రవీంద్ర, త్రివిక్రమ్, టంగుటూరి అన్నపూర్ణ పాల్గొన్నారు.

జెండాలను పక్కనబెట్టి హోదా కోసం పోరాడండి

విజయవాడ, ఫిబ్రవరి 20: ప్రత్యేక హోదా కోరుతూ 123 స్వచ్చ్ పాలిటిక్స్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 10 రోజులపాటు జరిగే నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజు మంగళవారం బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎవరి ప్రయోజనాలకోసం వారు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదన్నారు. అందరి ఉమ్మడి ప్రయోజనాన్ని పక్కనపెట్టి స్వప్రయోజనాలు ధ్యేయంగా పార్టీలు పనిచేయకుండా ప్రజలకోసం కేంద్రంపై వత్తిడి తెచ్చేవిధంగా జెండాలను పక్కనపెట్టి ఉమ్మడిగా పోరాడాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి 11 యూనివర్విటీలు ఇస్తామన్న బీజేపీ హామీ అటకెక్కిందన్నారు. హోదాకోసం పోరులో ఎస్‌ఎఫ్‌ఐ ముందు పీఠిన ఉండి పోరాడుతున్నారన్నారు. ఐదవ రోజు దీక్షలలో పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎన్.కోటి, నగర నాయకులు కె.ప్రసన్నకుమార్, ఏసుబాబు, సుమంత్, రాము, 123 స్వచ్ఛ్ పాలిటిక్స్ జిల్లా కోఆర్డినేటర్స్ లక్ష్మి, రూపీనాధ్, హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు శివరామకృష్ణ, మొండేటి దుర్గాప్రసాద్, షేక్ నాగూర్, సీరం రాజేష్‌కుమార్, భానుప్రకాష్ కూర్చున్నారు.