విజయవాడ

సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20: కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు వివిధ సంఘాలు మద్దతు తెలపటంతో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని జేఏసీ చైర్మన్ యం.మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. ధర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్‌ల కార్మికులు మంగళవారం సంపూర్ణ మద్దతుతో సమ్మె చేయటం జరిగింది. ఏఐటీసీ జిల్లా నాయకుడు టి.తాతయ్య ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు ముందుకు రావడంతో కార్మికులు ఉత్సాహంగా ముందుకొచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునరావు మాట్లాడుతూ జన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలో పనిచేస్తున్న కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ఇదేవిధంగా 13 జిల్లాలలో పనిచేస్తున్న కార్మికులు జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారని సమస్యల సాధనకు రిలే దీక్షలు చేపట్టగా జన్‌కో బోర్డు ఎండి విజయానంద్ విదేశీ పర్యటనలో ఉన్నారని, సమయమివ్వాలని బోర్డు కోరటంతో దీక్షలను నిలుపుదల చేసి సమ్మెను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగం గాని, రాష్ట్ర ప్రభుత్వంనుంచి కానీ ఎటువంటి స్పందన లేని కారణంగా గత్యంతరం లేక సమ్మె చేయవలసి వచ్చిందని వివరించారు. కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించాలని, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి జీతం ప్రతి నెల ఇవ్వాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేసి నేరుగా బోర్డు వేతనాలు చెల్లించాలని, బోర్డులో విలీనం చేయాలని కోరామన్నారు. కార్మికుడు మృతి చెందితే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని , ఆ కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పించాలని కోరామన్నారు. సమ్మెలో వివిధ సంఘాలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.