విజయవాడ

‘దీక్ష’పై కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 20న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో బుధవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా కళాశాలలు, యూనివర్శిటీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు, నగర పాలక సంస్థ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖలకు చెందిన సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారన్నారు. కార్యక్రమానికి తరలివచ్చే వారికి 200 ఆర్టీసీ బస్సులతోపాటు మరో వంద ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పటిష్టమైన దీక్షా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 7 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, జైన్ మతాలకు చెందిన మత పెద్దల ఆశీర్వాదం తీసుకుని సర్వమత ప్రార్థనల అనంతరం దీక్షలో కూచుంటారన్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఆయనతోపాటు 72 ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సుమారు 200 మంది ఆసీనులైయ్యేలా దీక్షా వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీక్షా వేదిక నుండి ఒక్కొక్క ప్రజా సంఘం నుండి ఒక ప్రతినిధి సుమారు 10 నిమిషాలు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రసంగిస్తారన్నారు. వేదిక సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నినదిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శిస్తారన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, మున్సిపల్ కమిషనర్ జె నివాస్, పోలీసు జాయింట్ కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ భూపాల్, డీఆర్‌వో బీఆర్ అంబేద్కర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

జగన్ సీఎం కావాలని జనమే కోరుతున్నారు
* నిరాడంబరంగా పార్థసారధి జన్మదిన వేడుకలు
మైలవరం, ఏప్రిల్ 18: జగన్ ముఖ్యమంత్రి కావాలని జనమే కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికలలో ఎవరు అడ్డుకున్నా జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కె పార్థసారధి స్పష్టీకరించారు. బుధవారం పార్టీ నాయకులు శీలం కోటిరెడ్డి ఇంట్లో కె పార్థసారధి జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈసందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పార్థసారధి కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌లు పార్థసారధికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అవటం కోసమే చంద్రబాబుపై అబద్ధాలు చెబుతున్నాడని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేస్తున్న ఆరోపణలను పార్థసారధి తీవ్రంగా ఖండించారు. ఉదయభాను మాట్లాడుతూ ఉమా హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.