విజయవాడ

నేటి దీక్షకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన ధర్మపోరాట దీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టర్ గురువారం అన్ని శాఖల అధికారులతో దీక్షకు చేపట్టవలసిన ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు ముఖ్యమంత్రి పాల్గొనే ధర్మపోరాట దీక్షకు జిల్లాల నుండి అన్నివర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వచ్చిన వారందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 11వేల మంది కూర్చునే విధంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశామని తాగునీరు, మజ్జిగ సిద్ధంగా ఉంచామన్నారు.

ధర్మపోరాటంలో భాగస్వాములు కండి
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతు గా అన్ని వర్గాలు ముందుకు రావాలాని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. అదేవిధంగా హోదా పోరాటంలో భాగంగా ఈనెల 21నుం చి చేపడుతున్న సైకిల్ ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేశినే ని భవన్‌లో గురువారం ఆయన మం త్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు దీక్ష ఢిల్లీకి వినిపించేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం విజయవాడ పార్లమెంటు పరిధిలోని ని యోజకవర్గాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు మంత్రి చేతుల మీదుగా ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నగరంలోని 37 డివిజన్‌కు చెందిన నల్లమోతు రాధికకు 72వేల చెక్కును, వినికిడి సమస్యతో బాధపడుతున్న వల్లూరి సాంబశివరావుకు చెవిటి మిషన్ అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఏంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, జలీల్, బుద్దా వెంకన్న, గనే్న ఫ్రసాద్, కొమ్మారెడ్డి పట్ట్భారాం తదితరులు పాల్గొన్నారు.

ధర్మ పోరాట దీక్షకు శ్రేణులు తరలిరావాలి
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 19: ప్రత్యేక హోదా సాధనలో భాగం గా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ధ ర్మ పోరాట దీక్షకు టీడీపీ శ్రేణులు భారీ గా తరలిరావాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ టీడీపీ సమన్వయ క మిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా కో సం, హోదా విషయంలో కేంద్ర ప్రభు త్వం అవలంభిస్తున్న అనుచిత వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు స్వయంగా 12 గం టల పాటు చేపడుతున్న ధర్మ పోరాట నిరాహార దీక్షలో హోదా కోరుకునే వా రందరూ పాల్గొనే విధంగా కృషి చే యాలన్నారు. అలాగే 21నుంచి జరిగే సైకిల్ యాత్ర కూడా విజయవంతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. చంద్రన్న పెళ్లి కానుక వెబ్‌సైట్ ఓపెన్ అయింది కాబట్టీ అర్హులైన వారు లబ్ధి పొందేలా శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారా వు, డెప్యూటీ ఫ్లోర్ లీడర్ నందెపు జగదీష్, కార్పొరేటర్లు కాకు మల్లికార్జున రావు, జీ మహేష్ పాల్గొన్నారు.