విజయవాడ

కందులు తక్షణమే కొనుగోలు చేయకుంటే మార్క్‌ఫెడ్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: మార్కెట్ యార్డుల్లో, రైతుల వద్దనున్న కందుల ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు గైకొనాలని, లేనిపక్షంలో మార్క్‌ఫెడ్ ముట్టడించాల్సి వస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎఐకేఎస్ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య హెచ్చరించారు. శుక్రవారం కంది రైతు సమస్యలపై వారు మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరక్టర్ వై.మధుసూదనరెడ్డిని కల్సి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కంది రైతుల ఇబ్బందులు, ముఖ్యంగా వినుకొండ రైతుల ఇక్కట్లను ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో క్వింటా కంది రూ.9వేల నుండి రూ.11వేల రూపాయల వరకు విక్రయించబడగా, ఈ ఏడాది కనీస గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వారు వివరించారు. ఈ నేపధ్యంలో రైతు సంఘాల ఆందోళన ఫలితంగా క్వింటా కందులు రూ.5450లకు నాఫెడ్, మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కంది దిగుబడులు అత్యధిక సంఖ్యలో వచ్చిన గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో ఉన్న 13వేల టన్నుల కందులను ఏప్రిల్ 30 వరకు కొనుగోలు చేసేలా హామీ ఇచ్చారు. కాని అకస్మాత్తుగా ఏప్రిల్ 20వ తేదీతో కొనుగోళ్లు ఆపేశారు. దీంతో వినుకొండ మార్కెట్ యార్డులో దాదాపు 20వేల టిక్కీలకు రైతులు కాపలా కాయలేక పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు వాటిని అక్కడి నుండి తీసుకెళ్లలేక, తీసుకువెళ్లినా ఏం చేయాలో తెలియక అక్కడే జాగారం చేస్తూ కందుల బస్తాలకు రోజుల తరబడి కాపలా కాయలేక అనేక అవస్థలు పడుతున్నారని వారు తెలిపారు. దీనిపై సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యాన ఈనెల 15,16 తేదీల్లో 30 గంటల దీక్ష చేపట్టినప్పటికీ అధికార యంత్రాంగంలో స్పందన లేదని వారు మార్క్‌ఫెడ్ ఎండీకి వివరించారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను అర్ధం చేసుకుని వినుకొండ యార్డులో ఉన్న కందులతో పాటు రైతుల వద్దనున్న నిల్వలన్నింటినీ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ముప్పాళ్ల, రావుల కోరారు. దీనిపై స్పందించిన మార్క్‌ఫెడ్ ఎండీ తాను తక్షణమే ఈ సమస్యపై సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రితో చర్చించి మూడు, నాలుగురోజుల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ముప్పాళ్ల మీడియాకు తెలిపారు. ఎండీ ఇచ్చిన హామీ మేరకు కందులు కొనుగోళ్లు చేయనిపక్షంలో మార్క్‌ఫెడ్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ల, రావుల వెంట సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, వినుకొండ ఏరియా కార్యదర్శి ఎ.మారుతివరప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న మద్దతు ధర చెల్లింపునకు చర్యలు
కూచిపూడి, మే 18: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక ఆందోళన చెందుతున్న రైతన్నలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.200 అదనపు ధరను చెల్లించేందుకు చర్యలు చేపట్టిందని మొవ్వ వ్యవసాయశాఖ ఎఓ కె శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. మండలంలోని 21 గ్రామాల్లో రబీగా ఈ ఏడాది 462 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారన్నారు. ఎకరాకు 30 ఉండి 40 క్వింటాళ్ల దిగుబడి లభించగా క్వింటాల్ రూ.1150కే పరిమితం కావటంతో రైతన్నలకు వ్యవసాయ ఖర్చులు అధికమై తీవ్రంగా నష్టపోవటంతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై క్వింటాల్‌కు అదనంగా రూ.200 చెల్లించేందుకు సర్వే చేపట్టాలని ఆదేశించటంతో మొవ్వ మండలంలోని ఎనిమిది మంది ఎంపీఎఓలు, వీఆర్‌ఓల సహకారంతో గ్రామాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులు నుండి దిగుబడుల సమాచారాన్ని నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు శుక్రవారం విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.