విజయవాడ

జల సంరక్షణ పనులకు జూన్ నెలాఖరు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: జలసంరక్షణ పనులకు వచ్చే 30వ తేదీ వరకు గడువు ఉన్నందున పెద్దఎత్తున పంట కుంటలు తవ్వే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులకు ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలసంరక్షణ పథకం ద్వారా జలవనరులు పెంచుకునే విధంగా పనులు చేసుకునే సౌలభ్యం ఉన్న దృష్ట్యా ప్రతి గ్రామంలో పంటకుంటలు తవ్వించే పనులు చేపట్టాలన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పంట పొలాల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా పంటకుంటలు తవ్వుకునే అవకాశం ఉందన్నారు. రైతుల్లో అవగాహన కల్పించి జిల్లాలోని అన్ని గ్రామాల్లో 10వేల పంటకుంటలు తవ్వించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యమంత్రి జలసంరక్షణ పనులను సందర్శించే అవకాశం ఉన్నందున గ్రామాల్లో ప్రభుత్వపరంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో షెడ్, మంచినీరు, మజ్జిగ వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. పెదలంక డ్రైనేజీ పనుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉన్నందున ఇరిగేషన్, ఫిషరీస్ శాఖలు దీని నిర్మాణాన్ని చేపడితే డెల్టా వాసులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎల్‌ఈసీ కార్డులు 13000 అయ్యాయని, ఇంకా 52,000 మందికి ఇవ్వాల్సి ఉందని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిభ కనపరచిన అధికారులకు అవార్డులు
కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో ప్రగతి సూచీల్లో ప్రతిభ కనపర్చిన అధికారులను బంగారు పథకాలతో సత్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పథకాలు పొందినవారిలో జాయింట్ కలెక్టర్ కె.విజయకృష్ణన్, వీఎంసీ కమిషనర్ జె.నివాస్, డీఆర్‌ఓ బిఆర్ అంబేద్కర్, ప్రాజెక్టు డైరక్టర్లు డీఆర్‌డీఏ డి.చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ సూర్యనారాయణ, ఐసీడీఎస్ కె.కృష్ణకుమారి, జాయింట్ డైరక్టర్లు, వ్యవసాయం మోహనరావు, పశుసంవర్ధక శాఖ సూర్యనారాయణ, ఈడీఎస్సీ కార్పొరేషన్ ఎన్‌వి సత్యనారాయణ, డీపీఓ సుబ్రమణ్యం, పీఓఎస్‌ఎస్‌ఏ ప్రసాద్, సీఈఓ శ్రీదేవిలతో పాటు గుడివాడ మున్సిపల్ కమిషనర్ గుర్తించిన బ్యాంకులు, మండల, గ్రామ స్థాయి అధికారులకు మొత్తం 75 మందిని సత్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విలేజ్‌మాల్స్ హట్స్ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 12 సెంట్ల భూమి, గ్రామ వనానికి 25 సెంట్ల భూమి సేకరించి పంచాయతీలకు అప్పగించే విధంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు.

పట్టణంలో స్టేడియం నిర్మిస్తాం
మచిలీపట్నం (కల్చరల్), మే 18: పట్టణంలో క్రికెట్ స్టేడియంను ఖచ్చితంగా నిర్మించి తీరుతామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ మచిలీపట్నం క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మంత్రి రవీంద్రకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. అండర్-19 జిల్లా జట్టు ఎంపికలో స్థానం సంపాదించిన వి మణికంఠ, కె రణా ప్రతాప్‌లను మంత్రి అభినందించారు. క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కోచ్ సికినం శ్రీనాధ్‌ను అభినందించారు. ఈ సమావేశంలో ఆది నారాయణ, ఎస్ కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.