విజయవాడ

సమష్టి కృషితోనే అవార్డు సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 18: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 10 లక్షల జనాభా దాటిన నగరాల కేటగిరిలో ఇండియాస్ క్లీనెస్ట్ బిగ్ సిటీ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని నివాస్ పిలుపునిచ్చారు. అవార్డు సాధించిన సందర్భంగా శుక్రవారం వీఎంసీ కార్యాలయంలో వీఎంసీ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ ఈశ్వర్, కార్యవర్గం ఆధ్వర్యంలో కమిషనర్‌ను తన ఛాంబర్‌లో ఘనంగా సత్కరించిన సందర్భంగా నివాస్ మాట్లాడుతూ అవార్డు సాధనలో కృషి చేసిన అందరూ అభినందనీయులేనన్నారు. కేవలం పారిశుద్ధ్య విభాగమే కాకుండా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, యూసీడీ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం వల్లనే అవార్డును సాధించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 40శాతం ప్రజల నుంచి నేరుగా వారి వారి అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలు కూడా నగరంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి వంతుగా సహకరించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్న నగరం రానున్న రోజుల్లో నగరానికి స్వచ్ఛ భారత్ అవార్డులో మొదటి స్థానం సంపాదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ అర్జునరావు, సిటీ ప్లానర్ లక్ష్మణరావు, తదితరులుపాల్గొన్నారు.
అందరికీ కృతజ్ఞతలు
* మేయర్ కోనేరు శ్రీ్ధర్
స్వచ్చ సర్వేక్షణ్‌లో ఇండియాస్ క్లీనెస్ట్ బిగ్ సిటీ కేటగిరిలో నగరం మొదటి స్థానంలో నిలపడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శుక్రవారం వీఎంసీ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో వీఎంసీ మినిస్ట్రీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ ఈశ్వర్, కార్యవర్గం, ఉద్యోగులు కలిసి మేయర్‌ను ఘనంగా సత్కరించిన సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ వీఎంసీని రాష్ట్రంలో మొదటి స్థానం, దేశంలో 4వ స్థానం సాధించడం పట్ల ఇంతటి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు.