విజయవాడ

జిల్లాలో వారానికి 700 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: జిల్లాలో వారానికి 700 ఇళ్లు చొప్పున నిర్మాణ పనులు పూర్తిచేయాలని అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ విషయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో గృహ నిర్మాణశాఖ, రెవెన్యూ అధికారులతో జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రగతిని శనివారం సాయంత్రం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సకాలంలో పూర్తి చేయించే బాధ్యత అధికారులదేనని ఈ విషయంలో లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. పట్టణ గృహ నిర్మాణ పనులకు సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లోనూ, విజయవాడ నగరపాలక పరిధిలోనూ లబ్దిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని నిర్మాణ పనులు చేపట్టుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఈ టిట్‌కోను కలెక్టర్ ఆదేశించారు. వారానికి 700 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, జేసీ-2 పి.బాబూరావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు సిహెచ్ రంగయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

రోగుల పట్ల అమర్యాద క్షమించరాని నేరం
* వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ, మే 19: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు సేవాభావంతో పనిచేయాలని అప్పుడే రోగులు వారిని దేవుడితో సమానంగా కొలుస్తారని, కొంతమంది డాక్టర్లు రోగుల పట్ల అమర్యాదగా మాట్లాడటం క్షమించరాని నేరమని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ తెలిపారు. ప్రసూతి విభాగంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయని ఈ విషయంలో జీజేహెచ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని విభాగాల్లోనూ రోగుల పట్ల ప్రేమపూర్వకంగా సిబ్బంది ప్రవర్తించేలా, ఏ ఒక్కరూ కూడా రోగల నుంచి డబ్బులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ పద్మజారాణి, జిల్లా ఆసుపత్రుల కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద్భిట్లకు ఘన నివాళి
విజయవాడ, మే 19: ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కథా రచయిత, లెక్చరర్ పెద్ద్భిట్ల సుబ్బరామయ్య మృతి సాహిత్య రంగానికి తీరని లోటని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన సంతాప సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా.వెలగా జోషి అన్నారు. సంతాప సభలో పాల్గొన్న పలువురు అధ్యాపకులు పెద్ద్భిట్లకి కళాశాలతో గల సంబంధాన్ని గుర్తుచేయడం జరిగింది. ఆయన రచనలు అనేకం రష్యన్, ఆంగ్లం భాషల్లోకి అనువదింపబడటం వారి స్థాయిని తెలియజేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల సాహిత్య అకాడమీ కూడా వారి రచనలను కథా సంపుటిను హిందీ భాషలోకి అనువదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు ఎస్‌ఎన్ సుభాని, డా.డిఎస్‌విఎస్ బాలసుబ్రహ్మణ్యం, టివి రాంబాబు, నాగార్జున, ఎ.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.