విజయవాడ

ప్రజల సంక్షేమమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో పేద వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ అన్నారు. మొగల్రాజపురం రావిచెట్టు కూడలి నుంచి కొండపై గంగానమ్మ గుడికి వెళ్లే మార్గంలో ఈ నెల 7న తెల్లవారుజామున కొండ అంచున ఉన్న రహదారి కొంతమేర జారి పక్క నివాసం మీద పడింది. గద్దె రామ్మోహన్ అదేరోజు ఘటనకు సంబంధించిన వివరాలను బాధిత ఇంటి యజమాని ఆర్ సాంబశివరావుతో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జారిపోయిన రహదారి పక్కనే డ్రైనేజీ పైపు మార్గంలో మట్టి పెళ్ళలు అధికంగా ఉండటం, గోడల మీద చెట్లు మొలవటం వంటి కారణాలతో గోడ కూలినట్టుగా స్థానికులు శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ఘటనను పరిశీలించిన ఆయన వెంటనే రహదారి మరమ్మతులు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ. 5 లక్షల అంచనా వ్యయంతో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. రహదారి కూలిన 10 రోజులలోనే నూతన రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించటం కేవలం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అనే్న వీరభోగ వసంతరాయులు, దోలకొండ జ్యోతి రత్నాకర్, అమిర్నేని కరుణకుమారి, నాగమోతు రాజు, దోమకొండ రవి తదితరులు పాల్గొన్నారు.

చురుగ్గా మహానాడు ఏర్పాట్లు
పెనమలూరు, మే 19: మండలంలోని కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరగబోయే మహానాడు సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సభాస్థలం ఏర్పాట్లలో మహానాడు ఏర్పాటు కమిటీ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, చైర్మన్‌లు మహానాడు సభను పర్యవేక్షిస్తున్నారు. పోలీసు జాగీరాలు వచ్చి గ్రౌండ్ అంతా అంగుళం అంగుళం పరీక్షించాయి. పార్కింగ్ ప్రాంతం, భోజనశాల, వంటశాల నిర్మాణాలు పూర్తకావచ్చాయి. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకరరావు, కాసరనేని మురళీ, ధన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కర్నాటక ‘విజయం’పై కాంగ్రెస్ సంబరాలు
విజయవాడ (కార్పొరేషన్), మే 19: కర్ణాటకలో బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు చేసినా చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సీఎం యడ్యూరప్ప విశ్వాసం ప్రకటించుకోలేక ముందుగానే రాజీనామా చేసిన ఉదంతంపై శనివారం సాయంత్రం నగరంలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. కాంగ్రెస్ పార్టీ విజయపరంపరకు కర్ణాటక ఎన్నికలు నాంది పలికాయని, తనకు ఎదురేలేదంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ప్రజస్వామ్యాన్ని హేళన చేస్తూ తమ నిరంకుశత్వ చర్యలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈకార్యక్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి వీ గురునాథం. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసకుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పీ రాకేష్‌రెడ్డి, అమర్, విజయకుమార్, కే శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.