విజయవాడ

నగరంలో 2లక్షలకు పైగా ఓట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 22: రాష్ట్ర రాజధాని ప్రాంతమైన నగరంలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో రెండు లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. ఈ ఓట్ల గల్లంతు వెనుక అధికార టీడీపీ ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు. వించిపేటలోని తన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లో మొత్తంగా 7.30 లక్షల ఓట్లు ఉండగా ఆ తరువాత నాలుగేళ్లలో మరో 70వేల కొత్త ఓట్లు చేరాయన్నారు. దీని ప్రకారం ఇప్పుడు మొత్తంగా 8లక్షల ఓట్లు మూడు నియోజకవర్గాల్లో ఉండాల్సి ఉండగా అధికారిక లెక్కల ప్రకారం 5.90 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయని, 2.10 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తెలుస్తోందన్నారు. తొలగించిన ఓట్లన్నీ దళిత, మైనార్టీ, బీసీలకు చెందినవేనని, ఆయా వర్గాల్లో వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డికి, ఆ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్కసుతోనే టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో 2014 ఎన్నికల సమయంలో 2.30 లక్షల ఓట్లు ఉండగా తాజాగా అవి 1.70 లక్షలకు తగ్గాయన్నారు. ఈ నాలుగేళ్లలో 25వేల మంది వరకు కొత్తగా ఓటర్లు నమోదు కాగా, ఇక్కడ ఓట్లు పెరగకపోగా తగ్గి పోయాయన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలను చూసి జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ ప్రభుత్వ పెద్దలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వారి ఓట్లన్నీ తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. పంజా సెంటర్ సమీపంలో షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం మూడేళ్ల నుండి సాగుతోందని ఆసిఫ్ విమర్శించారు. విలేఖర్ల సమావేశంలో వైసీపీ నాయకులు సయ్యద్ మన్సూర్, ఇమ్రాన్ ఖాన్, షాజహాన్, వరబాబు పాల్గొన్నారు.

రేపు కేబీఎన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
* హాజరుకానున్న మంత్రి గంటా, కృష్ణా వర్శిటీ ఉప కులపతి
పాతబస్తీ, మే 22: కాకరపర్తి భావనారాయణ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 24న కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాసు చెప్పారు. మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల 53 వసంతంలో కొనసాగుతోందన్నారు. అందరి సహకారంతో కళాశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉన్నత విద్యావ్యాప్తికి, తద్వారా సామాజిక వికాసానికి అండగా నిలుస్తోందన్నారు. కళాశాల 2010లో స్వతంత్ర ప్రతిపత్తి హోదా పొందిందన్నారు. కాలేజీ ఫర్ పొటాన్షియల్ ఎక్స్‌లెన్స్ అవార్డును కూడా పొందిందన్నారు. అదే క్రమంలో కళాశాలలో తొలిసారిగా ఈ నెల 24న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా, కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎన్ రామకృష్ణారావు గౌరవ అతిథిగా హాజరవుతారని శ్రీనివాసు వివరించారు. సమావేశంలో కళాశాల కమిటీ సభ్యుడు ఎంవీకే హరగోపాల్, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.