విజయవాడ

సివిల్ సప్లరుూస్ హమాలీలకు పెరిగిన కూలిరేట్లు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్రంలో సివిల్ సప్లరుూస్ కార్పొరేషన్ ద్వారా పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మండల స్టాక్ పాయింట్లలో పనిచేసే హమాలీ కార్మికులకు ధరలకు అనగుణంగా కూలిరేట్లు పెంపుదల ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుందని, 2018 జనవరి 1 నుండి కొత్త కూలిరేట్లు ఇవ్వాల్సిన కార్పొరేషన్ అధికారులు 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మండిపడ్డారు. 2017 డిసెంబర్ 25న కార్మిక సంఘాలతో కార్పొరేషన్ యాజమాన్యం చర్చలు జరిపి అంగీకరించిన అగ్రిమెంట్ ప్రకారం క్వింటాకు ఎగుమతి, దిగుమతికి పెరిగిన రేట్ల ప్రకారం కొత్త కూలి ఇవ్వాల్సి ఉండగా కార్పొరేషన్ కమిషనర్, ఎండీ, సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్టవ్య్రాపితంగా మంగళవారం 13 జిల్లాల్లో వందలాది మంది కార్మికులు ఆందోళన నిర్వహించారన్నారు. ఈసందర్భంగా కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నుండి డీఎం కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం పెద్దఎత్తున ధర్నా నిర్వహించామని ఆయన తెలిపారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ నేతలు చలసాని వెంకట రామారావు, ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ హమాలీ కార్మికులకు చట్టబద్ధంగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 22న అన్ని జిల్లాల్లో లేబర్ కమిషనర్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళనలు, 28న విజయవాడలో రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ఆందోళనలో హమాలీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా లాంటి పథకాల్లోనూ రెక్కలు ముక్కలు చేసుకుని పనులు చేస్తున్న హమాలీ కార్మికులను కష్టపెట్టడం ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొఠారి రమణ, మేస్త్రులు వీర్రాజు, రాంబాబు, నరసింహారావు, శ్రీను, శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు కె శైలజ, తదితరులు పాల్గొన్నారు.