విజయవాడ

రాష్ట్ర ప్రజల సమస్యలపై ఇంత అపహాస్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల విషయంలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు అపహాస్యంగా మాట్లాడడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ఏపీకి జరిగిన అన్యాయంపై భూమండలం బద్దలయ్యే రీతిలో కేంద్రాన్ని నిలదీస్తారని కొద్దిరోజులుగా టీడీపీ విపరీతమైన ప్రచారం చేసిందన్నారు. కేంద్రం స్పందనను బట్టి నిరసన వ్యక్తం చేస్తారని, అవసరమైతే సమావేశాన్ని బహిష్కరిస్తారని డాంబికాలు పలికారన్నారు. తీరా ప్రధాని మోదీ కరచాలనంలో భాగంగా ఎడమచేయి ఇస్తే మహాభాగ్యంగా భావించి బాబు ఉబ్బితబ్బిబ్బయ్యారని, అదే కుడి చేయి ఇచ్చి ఉంటే ఢిల్లీలోనే ఉండిపోయేవారేమోనని ఎద్దేవా చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారేకానీ ఇస్తామని విభజన చట్టంలో చెప్పలేదంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గేలిగా మాట్లాడం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఏపీ అంటే కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని అర్థమవుతోందన్నారు. ఎన్నికల సమయంలోఏపీ బీజేపీ మేనిఫెస్టోలో ఏంపెట్టారు? ఎన్నికల సభల్లో మోదీ, వెంకయ్య నాయుడు ఉపన్యాసాల్లో ఏం చెప్పారు? అనే విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ సహా కేంద్ర మంత్రులు అపహాస్యం చేస్తుంటే ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన కేంద్రానికి దశ, దిశను నిర్దేశించాలని కోరారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల అఖిలపక్షం పిలుపులో భాగంగా ఈ నెల 29న జరుపతలపెట్టిన జిల్లా బంద్‌కు సీపీఐ రాష్ట్ర సమితి తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌కు సంఘీభావంగా మిగిలిన జిల్లాల్లోనూ ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశించారని, దాని నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూములన్నీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవడమే కాకుండా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై బుధవారం సిద్ధార్థ ఆడిటోరియంలో సీపీఐ - సీపీఎం ఆధ్వర్యంలో రాజకీయ సదస్సు జరుగుతుందన్నారు. దీనిలో రానున్న కాలంలో ఉద్యమాలు ఏవిధంగా చేపట్టాలి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని రామకృష్ణ వివరించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ఎన్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్, నగర పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.

22న జూనియర్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
విజయవాడ, జూన్ 19: ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్టవ్య్రాప్తంగా జూనియర్ కళాశాలల బంద్ పాటించనున్నట్లు నాయకులు తెలిపారు. జూనియర్ కళాశాలల బంద్ గోడపత్రికను మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు గుడిపాటి సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్తుల తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వమే ప్రభుత్వ కళాశాలలను దెబ్బతీస్తూ కార్పొరేట్ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా కార్పొరేట్ మాఫియా ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ 22న రాష్టవ్య్రాప్త జూనియర్ కళాశాలలు బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి పెడుతూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్నారు. కార్పొరేట్ ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థులంతా బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘటనా కార్యదర్శి రాజు, లక్ష్మి, వినయ్, సువిశాల్, తదితరులు పాల్గొన్నారు.