విజయవాడ

రేపు గంట పాటు యోగాసనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాల్టీల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ విజయ్‌కృష్ణన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాడే ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విజయ్‌కృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలతో పాటు అన్ని మున్సిపాల్టీలు, జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 21న ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు గంట పాటు యోగా కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వేయి మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని వీఎంసీ అదనపు కమిషనర్ డీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో డీఆర్‌ఓ బీఆర్ అంబేద్కర్, ఆర్డీఓ ఉదయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నూజివీడు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఆర్డీఓ సీహెచ్ రంగయ్య, మున్సిపల్ కమిషనర్ యోగాకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెడన, గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మున్సిపాల్టీల మున్సిపల్ కమిషనర్లతో ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు సంయుక్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులతో యోగా చేయించాలని డీఈఓ రాజ్యలక్ష్మిని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యోగాడే కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వెలగా జోషి ఆర్‌ఐఓలను ఆదేశించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే యోగా కార్యక్రమాలను ఆయూష్, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థలు నిర్వహించాలని విజయ్‌కృష్ణన్ ఆదేశించారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖాధికారులకు ఆమె సూచించారు.

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షకు 363 మంది గైర్హాజరు
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 19: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మ్యాథ్స్ పేపర్-2 పరీక్ష మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ పరీక్షకు 1711 మందికి గాను 1348 మంది హాజరవ్వగా 363 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 78.78గా నమోదైంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి తెలిపారు.