కృష్ణ

పేదల ఆకలి తీర్చే అక్షయపాత్రలు అన్న క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: పేదలకు మూడుపూటలా కడుపునిండాలనే కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేశారని, ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు పథకం నేటి పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు వేడుకల్లో భాగంగా ఆయన రాణిగారితోట ప్రాంతంలోని సిమెంట్ గోడౌన్, జాతీయ రహదారి పక్కన నెలకొల్పిన రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ పేదలకు కూడు, గూడు, నీడ అనే నినాదంతో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పేదలకు అన్ని సంక్షేమ పథకాలు వరంలా ఉపయోగపడుతున్నాయన్నారు. బడుగు జీవులకు మూడుపూటలా కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నెలకొల్పిన అన్న క్యాంటీన్లలో పేదలు కేవలం పూటకు రూ.5లు చొప్పున రోజుకు రూ.15లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం చేయవచ్చన్నారు. పూర్తి పరిశుభ్ర వాతావరణంలో వేడివేడిగా పేదలకు అన్నిరకాల పదార్థాలు వడ్డిస్తారని తెలిపారు. గరిష్టంగా మూడుపూటలా ఖరీదు చేసే అల్పాహారం, భోజనాలకు కేవలం రూ.15లు మాత్రమే పేదల దగ్గర తీసుకుని మిగతా రూ.60లు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తుందన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా కేవలం పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నెలకొల్పిందన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణం, వసతుల కల్పనకు రూ.36 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, తూర్పు నియోజకవర్గంలో ఇంకా పలు ప్రాంతాల్లో త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇ డానియేలు, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, జి నరసింహారావు, సీహెచ్ ఉషారాణి, రహీం, ముమ్మనేని ప్రసాద్, ఎల్ శివరామ్‌ప్రసాద్, వి రంగారావు, పి రామకృష్ణ, ఎం వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

గ్రంథాలయాలను విద్యార్థులు ఆదరించాలి
విజయవాడ, జూలై 11: ప్రతి విద్యా ర్థి నిత్యం ఏదో సమయంలో సమీప గ్రంథాలయాలకు వెళ్లి రావటం అలవర్చుకోవాలని, దీనివల్ల విజ్ఞానం, మానసికోల్లాసం లభిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు అన్నారు. గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య జయంతి సందర్భంగా సమ్మర్ క్యాంప్‌లో మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం వివిధ అంశాలపై అనేక పోటీలు జరిగాయి. ప్రారంభ సభలో హనుమంతరావు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్‌లో అనేకమంది విద్యార్థులు గ్రంథాలయాలకు రావటం అలవర్చుకున్నారని అన్నారు. గ్రంథాలయానికి వెళ్లే సమయం లేకపోతే కనీసం తమతమ పాఠశాలల్లో గ్రంథాలయాలకు వెళ్లాలన్నారు. పోటీల్లో దాదాపు 150 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మన్ క్యాంప్ వాలంటీర్‌గా పనిచేసిన డ్రాయింగ్ మాస్టర్ మల్లిక్‌ను చైర్మన్ సత్కరించారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి పాలంకి నాగరాజు, గ్రంథాలయాధికారులు ఝాన్సీరాణి, కళ్లేపల్లి మధుసూదనరాజు, రామచంద్రుడు ప్రసంగించారు. విజేతలు ఈ నెల 18న ఏలూరులో జరిగే జోనల్ స్థాయిలో పాల్గొనాల్సి ఉంది. చివరగా 24న విజయనగరంలో బహుమతి ప్రదానం జరుగుతుంది.

విద్యా రంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
విజయవాడ, జూలై 11: డిజిటల్ క్లాసుల నిర్వహణలో రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను విద్యా రం గంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యా శాఖాధికారి ఎం.వి.రాజ్యలక్ష్మి అన్నారు. పీఆర్‌టీయు ఉపాధ్యాయ సంఘం కృష్ణా జిల్లా శాఖ, సేవాదళ్ ఆధ్వర్యంలో డీఇఓ క్యాంప్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్ర భుత్వ పాఠశాలల విజయభేరి అనే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు అత్యున్నత ఫలితాలు సాధించాయని, 173 ప్రభుత్వ రంగ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు, 211 పాఠశాలలు జీపీఏ 10/10 సాధించాయని ఆమె అన్నారు. పీఆర్‌టీయు కృష్ణా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల గౌరవం పెంచటానికి, ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, త్వరలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలను సందర్శించి ప్రతిభా పురస్కారాలను అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే విజయభేరి లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్.పెరుమాళ్ళు, విజయవాడ రూరల్ మండల విద్యా శాఖాధికారి వెంకటరత్నం, ఎ.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.