విజయవాడ

పారిశుద్ధ్య విధుల్లో పంచసూత్ర విధానాలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: నగర పారిశుద్ధ్య విధుల్లో నిరంత రం పంచసూత్ర విధానాలను పాటించి మెరుగైన పారిశుద్ధ్యాన్ని నెలకొల్పాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అం దించిన స్వచ్ఛ భారత్ అవార్డును స్ఫూ ర్తిగా తీసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని సిబ్బందికి హితవుపలికారు. నగర పర్యటనలో భాగంగా గురువా రం ఉదయం 13వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నివాస్ తొలుత సిబ్బంది మస్తరు విధానాన్ని పరిశీలించారు. ఎంత మంది ఉన్నారు, వారిలో హాజరైన వారు ఎంతమంది, ఎంత మంది సెలవులో ఉన్నారన్న విషయాలపై పరిశీలన చేసిన ఆయన సిబ్బంది అంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అవార్డు సాధనకు అవలంభించిన పంచ సూత్ర విధానాలైన రోడ్డు, డ్రైన్‌ల పూర్తి శుభ్రం, డంపర్ బిన్ల వద్ద ఎటువంటి వ్యర్థాలు పడకుండా సరిచూసుకోవడం, ఖాళీ స్థలాల్లో ఎక్కడా చెత్త లేకుండాశుభ్రపర్చడం, ఆహార పదార్ధాల నిల్వలను వేరుగా సేకరించడం వంటి చర్యలతోపాటు అపార్టుమెంట్లు, నివాసల నుంచి చెత్త సేకరించే సమయంలో ముందుగానే చెత్తను విభజించేలా చేయడం, విభజన చేయని చెత్త సేకరణ నిలిపివేయడం వంటి చర్యలను నిరంతరం పాటించాలన్నారు.
మార్కెట్ అండ్ పార్కింగ్ పరిశీలన
బీసెంట్‌రోడ్డులోని వీహెచ్‌ఆర్ కాంప్లెక్సు, గోవిందరాజులు మార్కెట్ అండ్ పార్కింగ్, అన్సారీ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ నివాస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కాంప్లెక్సులను మల్టీ పర్పస్ కాంప్లెక్సులుగా తీర్చిదిద్దేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి డిజైన్లు, అంచనా వ్యయాలను సిద్ధం చేయాలన్నారు. వీహెచ్‌ఆర్ కాంప్లెక్సుకు లిఫ్ట్ లేదా స్టేర్‌కేస్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గోవిందరాజులు, అన్సారీ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించిన ఆయన గ్రౌండ్, మొదటి అంతస్తులను వాహనాల పార్కింగ్, రెండో అంతస్తులో షాపుల నిర్మాణంపై అంచనాలు, డిజైన్లను రూపొందించాలని ఎస్టేట్ మరియు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ సీహెచ్ కృష్ణమూర్తి పలువురు ఇంజినీరింగ్, హెల్త్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.