విజయవాడ

యూజీసీ రద్దు కుట్రను అడ్డుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూలై 19: బీజేపీ కేంద్రప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ జీసీ) రద్దుచేసి దానిస్థానంలో భారత విద్యాకమిషన్ (హెచ్‌ఇసీఐ)ను ఏర్పా టు చేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జేఏసీ ఏపీ ఉపాధ్యా య సంఘాల డిమాండ్ చేశాయి. గు రువారం ఉదయం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల వద్ద ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీస్, కాలేజీస్ టీచర్స్ ఆర్గనైజెషన్స్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీస్, రిటైర్డ్ ఆర్గనైజేషన్, ఏపీ ఉపాధ్యాయ జేఏసీ సంయు క్త ఆధ్వర్యంలో యూజీసీ రద్దును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ యూజీసీని రద్దు చేసి కేంద్రప్రభుత్వం ఉన్నతవిద్యను ప్రైవేటుపరం చేయాలని కుట్రపన్నుతోందన్నారు. వెంటనే మోడీ ప్రభుత్వం యూజీసీ రద్దును విరమించుకోకపోతే దేశంలోని 900 ప్రభుత్వ, ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీల అధ్యాపకులు పోరా టం చేస్తారని హెచ్చరించారు. ఎమెల్సీ సూర్యరావు మాట్లాడుతూ 1956లో ఏ ర్పడిన యూజీసీని మోడీ ప్రభుత్వం ర ద్దు చేసి ఉన్నత విద్యను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తోందని, దీని వలన పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షపండులా మారుతుందన్నారు. యూజీసీ చట్ట సవరణ బిల్లుకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం యూజీసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ ఉపాధ్యాయ సంఘం జేఏసీ కన్వీనర్ డాక్టర్ మద్దాల అంతోని మాట్లాడుతూ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ గత నెల 27న యూజీసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం జరిగిందన్నారు. ఈ రద్దు యోచన ఉపసంహరించుకోకపోతే ఆఖిల భారత యూనివర్శిటీ టీచర్స్, ఆఖిల భారత విశ్రాంత ఉపాధ్యాయల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన చేయటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ఫెడరేషన్ చైర్మన్ కే భాస్కరరావు, ఎమెల్సీ శ్రీనివాసులనాయుడు, జనరల్ సెక్రటరీ రాజగోపాలరావ, ఐపుట్టో వైస్ ప్రెసిడెంట్ జే తన్నప్రభాకర్, సెక్రటరీ ఎస్‌వీ కృష్ణ, ఆధ్యక్షుడు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో నూతన సీపీ
ఇంద్రకీలాద్రి, జూలై 19: ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీకనకదుర్గమ్మను గురువారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు సతీసమేతంగా దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించుకున్నారు. ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్ర భుత్వం నగర పోలీస్ కమిషనర్‌గా ని యమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించటానికి ముందుగానే ఉ దయం సతీసమేతంగా దుర్గమ్మను ద ర్శించుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా రాజగోపురం వద్ద పం డితులు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. ప్రత్యేక పూజలు తర్వాత వీరికి ఆశీర్వాద మండపంలో అర్చకులు దివ్య ఆశీస్సులను అందచేయగా సహాయ ఈవోశ్రవణం అచ్యుతరామయ్యనాయుడు వీరికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఈకార్యక్రమంలో ధర్మకర్తలు గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకరబాబు, పెంచలయ్య, సూర్యాలతకుమారి, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

దుర్గమ్మకు సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, జూలై 19: ఆషాడ మాసం సందర్భంగా గురువారం ఉద యం సిబ్బంది అమ్మవారికి నిష్టతో సా రె సమర్పించారు. దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, సిబ్బంది కే బలరామ్ గుణదల దేవస్థానం గృహ సముదాయం నుండి మహిళలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. రాజగోపురం వద్ద ఈవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వీ గౌరంగబాబు, ధర్మకర్తలు వె లగపూడి శంకరబాబు, గూడపాటి ప ద్మశేఖర్, పెంచలయ్య, సాంబసుశీల వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా రాష్ట్రం ప్ర జలు సుఖశాంతులతో ఉండాలని పం టలు సకాలం పండాలని ఆకాంక్షిస్తూ ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ సంకల్పం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈకార్యక్రమం లో ఫెస్టివల్ పర్యవేక్షకులు ఎన్ రమేష్, డీవీవీ సత్యనారాయణ, చైర్మన్ పీఏ స్వామిజీపాల్గొన్నారు. రెండో బ్యాచ్‌లో కృష్ణలంకకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఆషాడ మాస సారెను సమర్పించారు.