విజయవాడ

చిట్‌ఫండ్ మోసాలపై దృష్టి సారిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేకానేక సవాళ్లున్నప్పటికీ వాటినన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేయగలనని నూతన పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ ప్రాశస్త్యం కల్గినా విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యతలను వివరిస్తూ చిట్‌ఫండ్ మోసాలపై దృష్టి సారించి అమాయకుల ఆస్తులను కాపాడగలనన్నారు. సైబర్ క్రైంపై ప్రజలను అప్రమత్తం చేయగలనన్నారు. ప్రధానంగా ఆర్థిక మోసాలపై దృష్టి పెడతానన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని ప్రస్తావిస్తూ అధికారులతో కలిసి ముందు అధ్యయనం చేసి ఆపై తక్షణ చర్యలు చేపట్టగలనంటూ ప్రజలే కొద్ది రోజుల్లో మార్పులు కళ్లారా చూస్తారుకాదాయని అన్నారు. మహిళలు, విద్యార్థినులు భద్రతకు పెద్దపీట వేస్తానని మహిళా మిత్రలను బలోపేతం చేస్తానని అందరికీ పూర్తి భద్రత భావం కల్పిస్తానన్నారు. కమిషనరేట్‌లోని యువత సిబ్బంది సేవలను అన్నివిధాలుగా సద్వినియోగం చేసుకోగలనన్నారు. పెండింగ్‌లోనున్న కాల్‌మనీ కేసులన్నీ త్వరితగతిన విచారించగలనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోగలనన్నారు. ఈ సందర్భంగా జాయింట్ పోలీసు కమిషనర్ కింతారాణా తాతా, ట్రాఫిక్ డీసీపీ టీవీ నాగరాజు, ఇతర పోలీసు అధికారులు వచ్చి నూతన కమిషనర్‌ను అభినందించారు.