కృష్ణ

భయం.. భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 20: వర్షం పడుతుందంటే నగర కొండ ప్రాంతాల్లో విరిగి పడుతున్న కొండ చరియలతో కొండ ప్రాంత నివాసులకు కునుకు పడటం లేదు. ఎప్పుడు, ఎక్కడ కొండ రాయి విరిగి పడుతుందో తెలియని ఆందోళనలతో పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపటం పరిపాటిగా మారింది. కొండ చరియల నుంచి రక్షణ కల్పించే చర్యలపై కనీసం దృష్టి సారించని నగర పాలకుల చర్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తుండగా, రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు నగరంలోని పలుచోట్ల కొండ చరియలు విరిగిపడిన ఘటనలతో స్థానికుల ఆందోళనకు అంతులేకుండా ఉంది. ఒక పక్క వర్షం, మరోపక్క విరిగిపడే బండలతో ఆందోళనతో 48గంటల పాటు కాలం గడిపారు. ఈఘటనలలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. స్థానికులకు కొద్దిపాటి గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు. నగర పరిధిలోని 37, 3, తదతర డివిజన్ల నివాస ప్రాంతాలతోపాటు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై కొండ బండ రాళ్లు పడటం కలకలం రేగింది. కొండ చరియలు పడిన చోట అధికారులు అవసరమైన సహాయక చర్యలను చేపట్టారు. ఇదిలావుండగా పక్క కేరళ రాష్ట్రంలో నెలకొన్న ప్రకృతి విపత్కార్యానికి కొండ చరియలు విరిగిపడుతూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుండటంతో నగర కొండ ప్రాంత వాసులు ఆందోళనకు అవధుల్లేకపోయింది. గతంలో జరిగిన ఘటనలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆయా ప్రాంతాల్లో స్థానికులు కంటి మీద కునకు లేకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. ముఖ్యంగా క్రీస్తురాజుపురం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదురు రోడ్డు సోమవారం ఉదయం ఐదున్నరకు కుంగిన మట్టి కారణంగా ప్రహరీ గోడ కూలిపోగా, తరువాత సుమారు 10 గంటల సమయంలో అదే ఇల్లు కూలిపోయి పక్క ఇంటిపై పడిన ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఆస్తినష్టం భారీగా జరిగినా అప్రమత్తతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే అదే ప్రాంతంలోని మరో రెండు రోడ్ల అవతల మోస్తరు సైజు రాళ్లు ఇంటి ముంగిట జారీ పడిన ఘటనలో కొద్ది పాటితో ఆ ఇంటి చిన్న పిల్లలకు ప్రాణ ప్రమాదం తప్పింది. గుణదల పరిసర ప్రాంతాల్లో గంగిరెద్దుల దిబ్బ, ఏరియా, వన్‌టౌన్‌లో గోడకూలి ముగ్గురికి గాయాలైనాయి. గొల్లపాలెం గట్టు మీద నుంచి మట్టి పెళ్లలు కింద ఇంటిపై పడగా, ఇంటో నిద్రిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు ఆస్ప్రత్తికి తరలించారు. 37వ డివిజన్‌లో కూలిన కొండ చరియలతో పలువురు గాయాలపాలైనారు. అలాగే 19వ డివిజన్ ఇజ్జాడ అప్పలనాయుడు ఏరియాలో కొండ ప్రాంతాల ఇళ్లపై రాళ్లు, మట్టి పెడలు పడటంతో అనేక గృహాలు పూర్తిగాను, పాక్షికంగాను దెబ్బతిన్నాయి. ఇలాంటి చిన్నా, పెద్ద ఘటనలు పలు జరగడంతో మరికొద్ది రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలు కొండ ప్రాంతాల వారికి గుండెల్లో భయాందోళలకు అవధుల్లేవు. వీఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి కొండ చరియలు విరిగి పడే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల వారికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అశ్రునయనాల మధ్య
చెన్నుపాటి విద్య అంత్యక్రియలు
పటమట, ఆగస్టు 20: నగర ప్రజలు అప్యాయంగా అమ్మా.. అని పిలుచుకునే మాజీ పార్లమెంటు సభ్యురాలు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షరాలు, సంఘసంస్కర్త, గాధేయవాది చెన్నుపాటి విద్య అంత్యక్రియలు సోమవారం పటమంటలంక - రామలింగేశ్వరనగర్‌లోని రుధ్రభూమి స్మశానవాటికలో బంధువులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఘనంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందిన అమెను కడసారిగా చూసేందుకు పలు ప్రాంతాల నుండి వేలాది మంది అభిమానులు, బంధువులు తరలివచ్చి కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. బెంజీసర్కిల్ సమీపంలోని వాసవ్య మహిళా మండలి హాల్‌లో రెండు రోజులపాటు ప్రజల సందర్శనార్థం ఉంచిన చెన్నుపాటి విద్య భౌతికాయాన్ని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన పూలవాహనంపై ఉంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు వాసవ్య మహిళా మండలి నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై నిర్మలా కానె్వంటు మీదుగా పటమట ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు గుండా పటమట లంక చెన్నుపాటి విద్య గృహం మీదుగా రామాలయం, రామలింగేశ్వరనగర్ రుభ్రభూమి వరకు కొనసాగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఊరేగింపులో అభిమానులు అమర్ రహే చెన్నుపాటి విద్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెన్నుపాటి విద్య కుమారుడు చెన్నుపాటి వజీర్ బరువెక్కిన హృదయంతో తల్లికి రుధ్రభూమి స్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు వాసవ్య మహిళా మండలి హాల్‌లో ఆఖరిసారిగా చెన్నుపాటి విద్య పార్ధివదేహం వద్ద టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మాజీ మేయర్ తాడి శంకుతల, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ గౌతమ్ సవాంగ్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ పార్థసారధి, నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ ఫాదర్ కోషి, డాక్టర్ సమరం, విద్య కుమార్తెలు రష్మీ, కీర్తి, తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.