విజయవాడ

విరిగిపడిన కొండచరియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 20: దుర్గగుడి ఘాట్‌రోడ్, జాతీయ రహదారి మధ్య ఉన్న కొండచరియ వర్షానికి నాని సోమవారం ఉదయం విరిగి పడింది. ఆ సమయంలో ఈ రోడ్‌పై ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్‌రోడ్‌కు సపోర్ట్‌గా కొన్ని సంవత్సరాల క్రితమే కొండరాళ్లను గోడ తరహాలో ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతం బాగా నానిపోవడంతో కొండచరియ, రాళ్లు కిందికి జారిపడ్డాయి. దీంతో దేవస్థానం సిబ్బంది వెంటనే ఘాట్‌రోడ్ మార్గాన్ని మూసివేశారు. భక్తులు, వాహనాలను శ్రీ మల్లిఖార్జున మహామండపం వైపునకు మళ్లించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులను 4 లిఫ్ట్‌ల ద్వారా కొండ పైకి చేర్చారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఈవో ఘాట్‌రోడ్‌ను సోమవారం మూసివేయించారు. గతంలో ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడకుండా కొండకు నెట్ ఏర్పాటు చేసిన విషయంలో భారీగా నిధుల గోల్‌మాల్ జరిగినట్లు అనినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల కోసం అధికారులు కసరత్తు చేపట్టారు.

కేన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం
* ప్రముఖ వైద్యుడు డాక్టర్ మాధవ్
గుడివాడ, ఆగస్టు 20: కేన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే 90శాతం వరకు నివారించడం సాధ్యమవుతుందని, ఇందు కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు శిబిరాలను నిర్వహిస్తున్నామని మణిపాల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సె ంటర్ అంకాలజీ విభాగం వైద్యులు డాక్టర్ మాధవ్ దంతాల చెప్పారు. సోమవారం సాయంత్రం స్థానిక శరత్ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల్లో ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌లు, పురుషుల్లో నోరు, గొంతు క్యాన్సర్‌లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్‌లు వస్తుంటాయన్నారు. వీటి లక్షణాలపై అవగాహన కల్గివుంటే వెంటనే నివారించవచ్చన్నారు. వీటితో పాటు చిన్నపిల్లల్లో వి విధ రకాల క్యాన్సర్లు వస్తుంటాయని, బ్లడ్ క్యాన్సర్ కూడా ప్రమాదకరమేనన్నారు. కేన్సర్ శస్తచ్రికిత్సలో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. లాప్రోస్కోపిక్, మి నిమల్ యాక్సెస్ సర్జరీ, కీమోథెరపీ, ఫ్రోజెన్ సెక్షన్‌తో పాటు నాన్ అంకాలజీ సపోర్టివ్ స్పెషాలిటీస్ కూడా మణిపాల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధిగ్రస్థులకు ఆ రోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. మరో వైద్యుడు డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ గొంతు, నోటి కేన్సర్‌ల విషయంలో ప్రజల్లో అవగాహన మరింత పెరగాలన్నా రు. లక్షణాలు కన్పించిన వెంటనే వాటిని దాచుకోకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.