క్రైమ్/లీగల్

- కుటుంబ కలహాలతో మనస్తాపం -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సదరు యువకుడు తన అంత్యక్రియలకు అభిమాన హీరో హాజరుకావాలని కోరుతూ సూసైడ్ లేఖలో రాశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని హార్ట్‌పేటలో నివాసముంటున్న కొమరవల్లి అనిల్‌కుమార్ (27) జిమ్‌కోచ్‌గా పని చేస్తున్నాడు. 2015లో మంజుల అనే యువతితో పెళ్లి కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో సుమారు 20రోజుల క్రితం భార్య భర్త గొడవ పడగా భార్య మంజుల అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉంటున్న అనిల్‌కుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను తల్లిదండ్రులకు ఏమీ చేయలేకపోయానని, భార్య ఎడబాటుతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని, తల్లిదండ్రులు క్షమించాలని రాసిన మీదట తన అభిమాని పవన్ కళ్యాణ్‌నుద్దేశించి ఆసక్తికర సంభాషణలు లేఖలో పేర్కొన్నాడు. ‘అన్నయ్యా.. నా ఆత్మశాంతి కోసం చివరి కోరిక, నువ్వు నన్ను చూడటానికి రావాలి, నీ చేతుల మీదుగా నా అంత్యక్రియలు చేయాలి, నిన్ను బతికుండగా చూడలేకపోయాను, తప్పక చనిపోతున్నాను.. నువ్వు వస్తావని ఆశిస్తూ నీ పిచ్చి అభిమాని అనిల్ అని రాసి వేలిముద్ర వేశాడు. లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి మంగళవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామం వణుకూరు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా జాయింట్ కో-ఆర్డినేటర్ పోతిన వెంకట మహేష్, తదితరులు పరామర్శించారు.

పాముకాటుకు రైతు మృతి
కంకిపాడు, సెప్టెంబరు 4: మండలంలోని కోలవెన్ను గ్రామంలో మంగళవారం పాముకాటుకు గురై ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చొప్పవరపు వెంకటేశ్వరరావు(66) తన పొలంలో పిండి జల్లుతుండగా పాముకాటుకు గురయ్యాడు. సహచరులు విషయం తెలుసుకొని హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆస్పత్రికి వచ్చి రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు మృతదేహాన్ని తహసీల్దార్ ఎల్లారావు సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు భార్య రేషన్ డీలర్ వీరకుమారిని పరామర్శించారు.