క్రైమ్/లీగల్

రైళ్ల కింద పడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, సెప్టెంబర్ 8: కైకలూరులో వేర్వేరు ప్రాంతాల్లో రైల్వే గేటు దాటుతుండగా ప్రమాదశాత్తు ఇరువురు మృతి చెందిన సంఘటన ఇది. భీమవరం రైల్వే పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఆలపాడుకు చెందిన బత్తిన కృష్ణ (59) ఉదయం జాతీయ రహదారి నుండి పొలాలకు వెళుతుండగా 84 నెంబరు రైలు గేటు వద్ద పట్టాలు దాటుతున్నాడు. విశాఖపట్నం-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనగా అక్కడిక్కడే మృతి చెందాడు. మరో గుర్తు తెలియని వ్యక్తి 78వ నెంబరు గేటు వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు డీకొని మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై భీమవరం రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎవి ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం
కైకలూరు, సెప్టెంబర్ 8: మండల పరిధిలోని వింజరం లాకుల వద్ద పంట కాలువలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 50 సంవత్సరాలు వయస్సు గల వ్యక్తి మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. లాకు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.