విజయవాడ

ఏ సమాచారమైనా మనమే చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 11: దసరా మహోత్సవాల్లో మూలనక్షత్రం రోజున కుంకుమార్చన టిక్కెట్ ధర రూ. 5వేలు, మిగిలిన రోజుల్లో రూ. 3వేలు, ఇదేవిధంగా ప్రతి రోజు నిర్వహించే చండీహోమం టిక్కెట్ ధర రూ. 4వేలుగా నిర్ణయించినట్లు దుర్గగుడి ఈవో వి కోటేశ్వరమ్మ, చైర్మన్ వి గౌరంగబాబు తెలిపారు. పాతబస్తీ మాడపాటి వేంకటేశ్వరరావువసతి కేంద్రంలోమంగళవారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో సభ్యులు చర్చించి వాటిలో ఏక గ్రీవంగా ఆమోదించిన 14అంశాలను విలేఖరుల సమావేశంలో వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల ఉన్న ఆలయాల భూములను కౌలుకు ఇచ్చేందుకే నిర్వహించిన బహిరంగ వేలంపాటల్లో హెచ్చు మొత్తానికి పాడుకున్న రైతులకు ఈ భూములు కౌలుకు ఇచ్చేందుకు ఆమోదించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ట్రస్ట్‌బోర్డు కమిటీ చైర్మన్, ఈవో, దేవస్థానం పిఆర్‌ఓ, దేవస్థానం స్థానాచార్యుడు, సభ్యులు, తదితరులు మాత్రమే మీడియా ప్రతినిధులకు చెప్పాలని దేవస్థానం ఆవరణలో ఉన్న అద్దెదారులు ఎవరూ ఎటువంటి సమాచారం ఇవ్వరాదని పేర్కొన్నారు. దేవస్థానం నియమనిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారి లైసెన్సులను రద్దు చేస్తూ తీర్మానం చేస్తామని వివరించారు. దసరా మహోత్సవాల్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్‌ల ముద్రణకు ఇవ్వడంపై నిర్ణయం తీసుకున్నారు. కొండపైనా, కొండ కింద, రెండు ప్రాంతాల్లో సెల్‌ఫోన్ భద్రపర్చే రెండు కౌంటర్లను బుధవారం నుంచి దేవస్థానం ఆధ్వర్యంలోనే నిర్వహించటం జరుగుతోందని గతంలో ఉన్న కాంట్రాక్టర్‌పై పిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ లీజ్‌ను రద్దు చేసినట్లు వివరించారు. నిత్యం అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని పరిశీలించి ఘాట్‌రోడ్, అమ్మవారి రాజగోపురం, కొండకింద ఉన్న శ్రీమల్లికార్జున మహామండపం మూడు కీలకమైన ప్రాంతాల్లో టీ, కాఫీ, బిస్కెట్ తదితర వాటిని విక్రయించే స్టాల్స్‌ను దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమ్మవారికి లక్షకు పైగా విరాళాలు ఇచ్చే దాతలు 10 సంవత్సరాలు పాటు ఎప్పుడైనా అమ్మవారిని దర్శనం చేసుకోనేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం త్వరలో ఘాట్‌రోడ్ మార్గంలో అమ్మవారి చీరల వేలం కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దసరా మహోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటలకు వరకు నృత్య రూపక ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విధంగా శివాలయం వద్ద పూజా సామాగ్రిని విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో, చైర్మన్ తెలిపారు. ఈ సంవత్సరం కూడ పాత పద్ధతిలోనే భక్తులకు సకల ఏర్పాట్లు చేయటం జరుగుతోందని, క్యూ మార్గాలు కూడా కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఆలయాభివృద్ధి కోసం, భక్తులకు మరిన్ని వసతి సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలపై ఎవరైనా భక్తులు తగు సూచనలు, సలహాలు ఇస్తే వాటిని తప్పక పాటించటం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో దుర్గగుడి సహాయ ఈవో శ్రవణం అచ్యుత రామయ్య, స్థానాచార్యుడు శివప్రసాద్, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, గూడపాటి పద్మశేఖర్, లింగంబొట్ల దుర్గా ప్రసాద్, పెంచలయ్య, సాంబశివరావు, బడేటి ధర్మారావు, విజయశేఖర్, రామ్ ప్రసాద్, రామ్‌నాధమ్, రాజా, సాంబసుశీల, పాప, తదితరులు పాల్గొన్నారు.