విజయవాడ

పురుషుల సింగిల్స్ చాంప్ ఆంథోని అమల్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 12: నగరంలోని దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండో ర్ స్టేడియంలో జరుగుతున్న 11స్పోర్ట్స్ జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాం కింగ్ సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో అ ర్జున అవార్డీ ఆంథోనీ అమల్‌రాజ్ (పీఎస్‌పీబీ) చాంపియన్‌గా నిలువగా సుదాన్షుగ్రోవేర్ (పీఎస్‌పీబీ) ద్వితీయ, సుష్మిత్‌శ్రీరామ్ (ఏఏఐ), అనంత్‌దేవరాజన్ (తమిళనాడు)లు తృతీయస్థానం ద క్కించుకున్నారు. మహిళల సింగిల్స్ వి భాగంలో సుతిర్తాముఖర్జీ (హార్యానా) చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా సాగరికముఖర్జీ (ఆర్‌ఎస్‌పీబీ) ద్వితీ య, వౌసుమిపాల్ (పీఎస్‌పీబీ), అర్చనకామత్ (పీఎస్‌పీబీ)లు తృతీయస్థానంలో నిలిచారు. యూత్ బాలుర సిం గిల్స్ విభాగంలో మానవ్‌తక్కర్ (పీఎస్‌పీబీ) చాంపియన్‌గా నిలువగా పార్త్‌విర్మాని (్ఢల్లీ) ద్వితీయ, రోనిత్ భాంజ (ఏఏఐ), సిద్ధేష్ పాండే (మహారాష్ట్ర)లు తృతీయస్థానంలోనిలిచారు. యూత్ బాలికల సింగిల్స్ విభాగంలో శృతిఅమృత్ (ఆర్‌ఎస్‌పీబీ) చాంపియన్‌గా ని లవగా ఆకులశ్రీజ (ఆర్‌బిఐ) ద్వితీయ, సెలేనాదీప్తి సెల్వకుమార్ (ఏఏఐ), సృష్టి (మహారాష్ట్ర)లు తృతీయస్థానం సాధించారు. ఈనెల 6వతేదీ నుండి జరుగుతున్న 11స్పోర్ట్స్ జాతీయస్థాయి టేబు ల్ టెన్నిస్ ర్యాంకింగ్ సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారంతో ము గిశాయి. రెండు తెలుగురాష్ట్రాల నుండి క్రీడాకారులు ఎవరూ అనుకున్నంతగా రాణించలేదని చెప్పవచ్చు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ యూత్ బాలికల విభాగంలో రన్నరప్‌గా నిలువగా నగరానికి చెందిన శైలూనూర్‌భాషా మహిళల, యూత్ బాలికల విభాగాల్లో క్యార్టర్ పైనల్స్‌లో ఒటమి చెందగా జూనియర్ బాలికల విభాగంలో కాజోల్ క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ డా పీ అంకమ్మచౌదరి పాల్గొని విజేతలకు ట్రోపీలను అందజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్, ఉపాధ్యక్షులు విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి బలరాం, టోర్నమెంట్ డైరెక్టర్ గణేషన్, నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, పాండురంగరావు, వై దామోదరరెడ్డి, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.