విజయవాడ

ప్రణయ్ హత్యను సమర్థిస్తున్న మనువాదులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, సెప్టెంబర్ 17: మిర్యాలగూడ పట్టణంలో కులాంతర వివాహం చేసుకున్న దళితుడైన ప్రణయ్‌ను దారుణంగా హత్యచేయించటం ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని, ఈ అమానవీయ ఘటన, ఇది కులాలకు అతీతంగా మానవతావాదులందరూ తీవ్రంగా ఖండించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పిలుపునిచ్చింది. ప్రణయ్ హత్యను ఖండిస్తూ సోమవారం కేవీపీఎస్, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం లెనిన్ సెంటర్‌లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ సమాజ గమనాన్ని వెనక్కి తిప్పాలనుకునే మనువాదులు ఈ హత్యను సమర్థిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చాలా ఆందోళన కలిగిస్తోందని, ప్రణయ్ దళితుడు కాదని, క్రైస్తవుడని కావాలనే లవ్ జిహాద్ పథకంలో భాగంగా అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని, అలాంటి వాడికి ఇది తగిన శిక్షని, సమర్థిచటం చట్టవిరుద్ధమని , రాజ్యాంగ వ్యతిరేకమని, ఇలాంటి వారికి భారతీయ పౌరులమని చెప్పకునే అర్హత కూడా లేదని, సోషల్ మీడియాలో సాగుతున్న ఈ అనాగరిక ప్రచారాన్ని ఆపాలని, దీనికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఇద్దరూ చక్కగా కాపురం చేస్తున్నారనీ, ప్రస్తుతం అమృత వర్షిణి 6నెలల గర్భిణీ, ఆమె శోకాన్ని ఎవరూ తీర్చలేరన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైన తండ్రి, బాబాయిలను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించటమే కాకుండా వర్షిణి తండ్రి మారుతీరావు, ఆస్తుల్ని జప్తుచేసి వర్షిణికి అప్పగించాలని, వర్షిణికి, ప్రణయ్ తల్లితండ్రులకు పునరావాసానికి, కుటుంబ నిర్వహణకు ఆర్థిక సాయం చేసి, ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు నిరసన గళం వినిపించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నటరాజు, నాయకులు జీ క్రాంతికుమార్, ఐద్వా నగర నాయకులు కే నగేష్, దళిత అభ్యుదయ సమాఖ్య నగరాధ్యక్షుడు కొసనం కోటేశ్వరరావు, యువజన సంఘం నగర సహాయ కార్యదర్శి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో వరినాట్లు పూర్తి
* కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి

విజయవాడ, సెప్టెంబర్ 17: జిల్లాలో ఈ ఏడాది 3లక్షల 25వేల హెక్టార్లలో వరినాట్లు వేశారని, గత ఏడాది కంటే ఈ ఏడాది 2వేల హెక్టార్లలో అదనంగా వరినాట్లు పడినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికార్లతో సమీక్షించారు. ఈ ఏడాది మొత్తం 4లక్షల హెక్టార్లలో వరినాట్లు వేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కృష్ణానది చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్నామని, సాగునీటి కొరత లేదన్నారు. జాయింట్ కలెక్టర్-2, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని లక్ష్మీకాంతం వివరించారు.

నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌ల తయారీ
ముఠా గుట్టురట్టు!
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 17: నకిలీ ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కంప్యూటర్, సీపీయు, స్కానర్, ల్యామినేషన్ మిషన్, కట్టర్, నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌లు, మోటారు సైకిల్, సెల్‌ఫోన్లు, రూ.3,230 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం, నాగులూరుకు చెందిన నందిపాము ఫృథ్వీరాజ్ (33) అనే వ్యక్తి గవర్నర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తయారీ కేంద్రాన్ని కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్ సిబ్బందితో దాడిచేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనికి సహకరించిన మైలవరానికి చెందిన బుజ్జీ జిరాక్స్ సెంటర్‌లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఉల్లివల్లి నాగరాజు (23) అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆధార్ కార్డులను కంప్యూటర్ ద్వారా ఫొటోలు అడ్రసులు మార్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వేరే వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లపై వీరి ఫొటోలు పెట్టి నకిలీ కార్డులు తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సామగ్రితో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దసరా కరపత్రాల ఆవిష్కరణ
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 17: అమ్మవారి సన్నిధిలో అక్టోబర్ 10నుండి ప్రారంభం కానున్న ‘దసరా మహోత్సవాల’ కరపత్రాలను సోమవారం ఉదయం దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ, చైర్మన్ వీ గౌరంగబాబు ఆవిష్కరించారు. ఉదయం ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈవో కార్యాలయంలో వాటిని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో స్థానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్, సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, సీహెచ్ సాంబసుశీల పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో కమిషనర్
దేవదాయ శాఖ కమిషనర్ ఎం పద్మ సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఈవో వీ కోటేశ్వరమ్మ కమిషనర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకువెళ్లారు. తర్వాత కమిషనర్‌కు స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివ ప్రసాద్ అమ్మవారి అశీస్సులను