విజయవాడ

టీఆర్‌ఎస్‌తో టీడీపీ ప్రేమబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 18: టీఆర్‌ఎస్ ఎన్నికల్లో గెలిస్తే ఎక్కడ తనపై ఉన్న ఓటుకు నోటు కేసు బయటకు తీస్తుందనే భయంతోనే చంద్రబాబు ఆ పార్టీతో కలిసి ఉండేందుకు రాయబారాలు నడుపుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు బయపడే చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చారని చెప్పారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు హైదరాబాద్‌పై ఏపీకి హక్కు ఉన్న సందర్భంలో సెక్రటేరియట్‌లో భవనాలను కోట్లాది రూపాయలు పెట్టి బాగు చేయించారని చెప్పారు. ఓటుకు నోటు కేసు లేని సందర్భంలో నాగార్జున సాగర్‌లో వివాదం వస్తే ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఘర్షణ పడే విధంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఉమ్మడి ఆస్తుల విభజన, ఉద్యోగుల విభజన సక్రమంగా జరగలేదన్నారు. ఇదే విషయాన్ని బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ముఖ్య కారణం అంటూ రాహుల్ పర్యటనలో నల్లజెండాలు ప్రదర్శన చేయడానికి వీలులేదన్న బాబు, ఇప్పడు బీజీపీ అన్యాయం చేసిందని అనడం ఆయన నైజానికి అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్‌తో జరిగిన సయోధ్య కారణంగానే ఇటువంటి మాటలు బాబునోటి నుండి వస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టించిన నాటి నుండి వాటిని రద్దు చేయాలని మొదటి నుండి వైకాపా పోరాటం చేస్తోందన్నారు. వైకాపా పోరాటం కారణంగానే ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుందన్నారు. హోదా కోసం బలిదానం చేసిన వారి ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. బాబ్లీ విషయంలో నోటీసులు వస్తే పచ్చ జెండాలు పట్టుకుని ధర్నాలు చేసే స్థాయికి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ దిగజారిందన్నారు. సాధారణ పౌరుడైనా, సీఎం అయినా చట్టం ముందు ఒకటే అన్న విషయం చంద్రబాబు, టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. వంగవీటి కుటుంబం అంటే వైకాపాకు మొదటి నుండి ఎంతో గౌరవమన్నారు. గతంలో తూర్పు నియోజకర్గం నుండి పోటీ చేసిన రాధా ఇప్పుడు సెంట్రల్ నియోజకర్గం అడుగుతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో రాధాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ భావిస్తోందన్నారు. తూర్పు నియోజకవర్గం నుండి పోటీ పట్ల ఆసక్తి లేకపోతే బందరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వంగవీటి కుటుంబాన్ని వదులు కోవాలని గాని, అన్యాయం చేయాలని గాని వైకాపాకి లేదన్నారు. కార్యకర్తలు కూడా ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

డీమ్డ్ వర్శిటీల రాకతో ఇంజనీరింగ్ కళాశాలలు మూత!
* ఎమ్మెల్యే ఆలపాటి ఆందోళన
విజయవాడ, సెప్టెంబర్ 18: చంద్రబాబు నాయుడు గత తొమ్మిదిన్నరేళ్ల పాలనా కాలంలో గ్రామీణ స్థాయిలో సాంకేతిక విప్లవం తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతిచ్చారని, నేడు ఒకవైపు నాణ్యమైన విద్య లేక, మరోవైపు డీమ్డ్ యూనివర్శిటీలు, వలస విద్యాలయాల రాక వల్ల అవి ఒక్కొక్కొటీ వరుసగా మూతబడుతున్నాయని తెనాలి శాసనసభ్యుడు, సాంకేతిక విద్యా శాఖ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల్లోనే కాకుండా జేఎన్‌టీయులో సైతం పరిశోధనాత్మక విద్య అందటం లేదన్నారు. దాదాపు కళాశాలన్నీ సర్ట్ఫికెట్ల జారీకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత నానాటికీ దిగజారుతోందన్నారు. సర్ట్ఫికెట్‌తో వచ్చిన వారికి ఉద్యోగాలు లేవని, కిలోమీటర్‌కి మీటర్లు ఎన్నికూడా పట్ట్భద్రులు చెప్పలేకపోతున్నారని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2016-17లో 1.61 లక్షల సీట్లకు గాను 89,429 సీట్లు, 2017-18లో 1.41,244 సీట్లకు గాను 93,244 సీట్లు, 2018-19లో 1,39,023 సీట్లకు గాను 91,176 సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. జూన్‌లోనే ఎంసెట్ నిర్వహిస్తూ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి కొంతమేర తగ్గించామని మంత్రి వివరించారు.

ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి
ఎమ్మెల్సీ సంధ్యారాణి
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: మహిళలపై నానాటికీ పెరుగుతున్న దాడుల నియంత్రణకు ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సంధ్యారాణి పేర్కొన్నారు. శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో మహిళల రక్షణపై ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు అడిగిన ప్రశ్నపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ వయస్సుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల నియంత్రణకు గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం నియమించిన మహిళా హోంగార్డులను ట్రాఫిక్ నియంత్రణ, ఇతర పనులకు వినియోగించడం శోచనీయమన్నారు. నూతనంగా అమలుచేస్తున్న జీవోతో ఎంతటి ఘోరమైన నేరానికైనా స్టేషన్ బెయిల్ ఇస్తుండటంతో సాయంత్రం కల్లా నిందితులు బయటకు వచ్చి బే ఫికర్‌గా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ హోం మంత్రి చిన రాజప్ప రాష్ట్ర స్థాయిలో అవసరమైన సిబ్బందితో పోలీస్ సూపరింటెండెంట్ నేతృత్వంలో సీఐడీలో ఇప్పటికే మహిళా భద్రత విభాగం ఉందన్నారు. డీఎస్‌పీ, ఇన్‌స్పెక్టర్ హోదా అధికారి నేతృత్వాన జిల్లా ప్రధాన కార్యస్థానాలన్నింటిలోనూ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసినట్టు తెలిపిన ఆయన మహిళా చట్టాలకు మరింత పదును పెడుతున్నట్టు ప్రకటించారు.