విజయవాడ

పేదలకు పక్కా ఇళ్లు టీడీపీకే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: పేదవానికి పక్కాగృహాలను కల్పించడం టీడీపీకే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన శాసన మండలి సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టుపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పేదలతోపాటు పెళ్లయిన జంటలకు సైతం పక్కాగృహం ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు 50వేల కోట్ల రూపాయల వ్యయంతో 20లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారన్నారు. నాటి కాంగ్రెస్ పాలనలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల మధ్య ఉన్న తేడాలను స్వయంగా చూసి తెలుసుకోవచ్చునన్నారు. 100 ఏళ్లకైనా డోకాలేని నాణ్యతతో నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న షేర్‌వాల్ టెక్నాలజీతో సింగ్‌పూర్‌లో 17రోజులకు ఒక స్లాబ్ వేస్తుండగా, అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు గృహాల స్లాబును కేవలం 7 రోజులలోనే పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే కృష్ణాజిల్లాలో 11వేల అసంపూర్తి గృహాలు ఉన్నాయని, వాటి నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం సహకరించడంతోపాటు ఆన్‌లైన్ సమయంలో సాంకేతికంగా ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే తండ్రీ కొడుకుల గృహాలను వేర్వేరుగా కాకుండా రెండు గృహాలను కలిపి ఉమ్మడి నిర్మించుకునేందుకు మధ్యలో గోడకు తలుపుల ఏర్పాటుకు అంగీకరించాలని సభాముఖంగా మంత్రిని మంత్రి కాలవ శ్రీనివాసులును కోరారు.

పీఎంజేజేవై - చంద్రన్న బీమా పథకంగా ప్రచారం చేయాలి
* ఎమ్మెల్సీ సోము వీర్రాజు నినాదాలు
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న చంద్రన్న బీమా పథకాన్ని టీడీపీ తన సొంత పథకంగా ప్రజల్లో ప్రచారం చేసుకోవడం విడ్డూరమని బీజేపీ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పీఎంజేజేవై - చంద్రన్న బీమాగా పలకాలని పేర్కొన్నారు. మండలి సభ్యులు మూర్తి, వెంకన్న చౌదరి అడిగిన ప్రశ్నపై జరిగిన చర్చలో వీర్రాజు మాట్లాడుతూ ఈ పథకానికి కేంద్రం 600 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. ఈపథకంలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన బీమా సొమ్ము కూడా ఉందన్నారు. ఈదశలో టీడీపీ ఎమ్మెల్సీలందరూ వీర్రాజు ప్రకటనపై అభ్యంతరం చెబుతూ రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న లక్ష కోట్ల పన్నుల నిధులతోనే ఇలాంటి పథకాలను అమలుచేస్తున్నట్టు ప్రకటించడంతో సభలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు స్పందించిన కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ స్పందిస్తూ ఇకనుంచీ పీఎంజేజేవై - చంద్రన్న బీమా పథకంగానే భావించి ప్రజలకు ప్రచారం చేయనున్నట్టు తెలపడంతో వివాదం సద్దుమణిగింది.

వృక్ష మిత్ర, గ్రీన్ పాస్‌పోర్ట్ విద్యార్థులెక్కడ
ఎమ్మెల్సీ డాక్టర్ ఎఎస్ రామకృష్ణ
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వృక్ష మిత్ర అవార్డు, గ్రీన్ పాస్ట్‌పోర్ట్ విద్యార్థుల అమలుపై సక్రమంగా జరగడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మండలి ప్రశ్నోత్తరాలలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ 68వ వన మహోత్సవం సందర్భంగా ఆ రెండు అంశాలతోపాటు ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోని ఒక చెట్టుకింద కూర్చోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉండగా, అవేమి సక్రమంగా అమలుజరగడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ మంత్రి శిద్దారాఘవయ్య స్పందిస్తూ ఇప్పటివరకూ 52,58,808 మొక్కలను నాటడం జరిగిందని, వీటి సంరక్షణకు క్యాలెండర్ ప్రకారం రెగ్యులర్‌గా ఆయా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వన సంరక్షణ సమితి, మహిళా స్వయం సహాయక బృందాలు ఈ బాధ్యతలలో నిమగ్నమైనారని తెలిపారు. ఆయా కార్యక్రమాల విస్తృత అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.